జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర చొరబాటు భగ్నం.. టెర్రరిస్టును హతమార్చిన ఆర్మీ..

Published : Jul 11, 2023, 03:09 PM IST
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర చొరబాటు భగ్నం.. టెర్రరిస్టును హతమార్చిన ఆర్మీ..

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాది చేసిన ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ విఫలం చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహించి, ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. 

జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్ లోకి చొరబడేందుకు ఉగ్రవాది చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. చొరబాటుకు వ్యతిరేకింగా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టి విజయం సాధించింది. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఆ ఉగ్రవాది గత రాత్రి నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్ లో చొరబాటుకు యత్నించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు.. కేసును విచారించి అతడిని శిక్షించాలి : ఢిల్లీ పోలీస్ ఛార్జిషీట్

ఇదిలావుండగా.. రాజౌరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద ఆపరేషన్, భద్రతా సన్నద్ధతను ఆర్మీ నార్తర్న్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం సమీక్షించారు. సైనికుల ఉన్నత స్థాయి ప్రొఫెషనలిజం, అప్రమత్తతను ఆయన ప్రశంసించారు. ఉపేంద్ర ద్వివేది రాజౌరీ ప్రాంతంలోని ఫార్వర్డ్ రెజిమెంట్ ను సందర్శించారని భారత సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది.

భద్రత, కార్యాచరణ సన్నద్ధతను సమీక్షించడానికి ఆయన రెజిమెంట్ ను సందర్శించారని ఆర్మీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కమాండర్ సైనికులతో సంభాషణలో నిమగ్నమయ్యారని, వారి అప్రమత్తత, వృత్తి నైపుణ్యానికి ధన్యవాదాలు తెలిపారని చెప్పింది. 

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు

కాగా.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గత నెల 27వ తేదీన తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ కాల్పుల సమయంలో ఓ పోలీసుకు కూడా గాయాలు అయ్యాయి. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, అతడి గుర్తింపును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు ఆ సమయంలో తెలిపారు.

పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి.. పసికందును ఆడిస్తూ, విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్.. ఫొటోలు వైరల్

‘‘కుల్గాం జిల్లాలోని హౌరా గ్రామంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఒక జేకేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా.. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) వెంబడి భారీ చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేసిన కొద్ది రోజులకే ఈ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ జరగడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?