లోక్ సభ ఎన్నికలు.. ఆరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

By Sairam Indur  |  First Published Mar 26, 2024, 10:19 AM IST

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. విడతల వారీగా పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. అందులో ఎంత మంది పేర్లు ఉన్నాయంటే ?


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్ లో నలుగురు, తమిళనాడులో ఒకరిని మాత్రమే ఆ పార్టీ ప్రకటించింది. అయితే రాజస్థాన్ లోని అజ్మీర్ స్థానానికి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ స్థానానికి సుదర్శన్ రావత్, భిల్వారా స్థానానికి డాక్టర్ దామోదర్ గుర్జార్ లను పార్టీ ఎంపిక చేసింది. అలాగే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ నేత ప్రహ్లాద్ గుంజాల్ కోటాలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో తలపడనున్నారు.

దక్షిణ చెన్నై ఎంపీ స్థానం: నామినేషన్ దాఖలు చేసిన తమిళిసై

Latest Videos

తమిళనాడులోని తిరునల్వేలి స్థానానికి న్యాయవాది సి.రాబర్ట్ బ్రూస్ ను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి బీజేపీ తరఫున నైనార్ నాగేంద్రన్, అన్నాడీఎంకే అభ్యర్థి ఎం.ఝాన్సీరాణి పోటీ చేస్తున్నారు. తమిళనాడు శాసనసభలోని విలవన్కోడ్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డాక్టర్ తరైహై కత్బెర్ట్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించింది.

బాబు మోహన్‌కు కేఏ పాల్ ప్రమోషన్.. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం

కాగా.. కాంగ్రెస్ ఇప్పటి వరకు 190 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత శనివారం 46 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఉన్నారు. వారణాసి స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై ఆ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది. 

సహారన్పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, అమ్రోహా నుంచి డానిష్ అలీ, ఫతేపూర్ సిక్రీ నుంచి రామ్ నాథ్ సికార్వార్, కాన్పూర్ నుంచి అలోక్ మిశ్రా, ఝాన్సీ నుంచి ప్రదీప్ జైన్ ఆదిత్య, బారాబంకీ-ఎస్సీ నుంచి తనూజ్ పునియా, డియోరియా నుంచి అఖిలేశ్ ప్రతాప్ సింగ్, బన్స్గావ్-ఎస్సీ నుంచి సదన్ ప్రసాద్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

click me!