Lok Sabha Elections 2024 : 195 మందితో బీజేపీ తొలి జాబితా .. వారణాసి నుంచి నరేంద్ర మోడీ

Siva Kodati |  
Published : Mar 02, 2024, 06:36 PM ISTUpdated : Mar 02, 2024, 07:23 PM IST
 Lok Sabha Elections 2024 :  195 మందితో బీజేపీ తొలి జాబితా .. వారణాసి నుంచి నరేంద్ర మోడీ

సారాంశం

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి జాబితాను ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్ధుల జాబితాను పార్టీ నేతలు వినోద్ తావడే, అర్జున్ పాండేలు విడుదల చేశారు. 

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి జాబితాను ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్ధుల జాబితాను పార్టీ నేతలు వినోద్ తావడే, అర్జున్ పాండేలు విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తారని వినోద్ తావడే వెల్లడించారు. 16 రాష్ట్రాల్లోని 195 నియోజకవర్గాలకు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.  ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ).. ఈ 16 రాష్ట్రాల్లోని అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల వారీగా పశ్చిమ బెంగాల్ (27), మధ్యప్రదేశ్ (24), గుజరాత్ (15), రాజస్థాన్ (15) , కేరళ (12), తెలంగాణ (9), జార్ఖండ్ (11), ఛత్తీస్‌గఢ్ (12), ఢిల్లీ (5), జమ్మూకాశ్మీర్ (2), ఉత్తరాఖండ్ (3), అరుణాచల్ ప్రదేశ్ (2), గోవా , అండమాన్ అండ్ నికోబార్, డామన్ అండ్ డయ్యూలలో ఒక్కొక్కరి చొప్పున ఖరారు చేసింది. తొలి జాబితాలో 28 మంది మహిళలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 , యువతకు 47 , ఓబీసీలు 57 మందికి స్థానం కల్పించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం