లాక్‌డౌన్ ఎఫెక్ట్: వైద్యం అందక ముంబైలో లాయర్ మృతి

By narsimha lodeFirst Published Apr 19, 2020, 2:55 PM IST
Highlights

:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు ఆసుపత్రుల్లో వైద్యం చేసేందుకు నిరాకరించడంతో 56 ఏళ్ల జయదీప్ జైవంత్ అనే వ్యక్తి  మృతి చెందాడు.


ముంబై:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు ఆసుపత్రుల్లో వైద్యం చేసేందుకు నిరాకరించడంతో 56 ఏళ్ల జయదీప్ జైవంత్ అనే వ్యక్తి  మృతి చెందాడు. తీవ్రమైన గుండెనొప్పితో ఉన్న జయదీప్‌ను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో అతను మరణించాడని మృతురాలి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నవీ ముంబై వషీ సెక్టార్ 17 లో  జయదీప్ జైవంత్ కు ఈ నెల 14వ తేదీన గుండెపోటు వచ్చింది.  భోజనం చేసిన వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. వెంటనే అతని పల్స్ చూస్తే ఇంకా కొట్టుకున్నాయని తెలిసింది. వెంటనే అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లినట్టుగా ఆయన భార్య దీపాళి చెప్పారు.

తాము నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగానే కరోనా కేసులు మినహా ఇతర రోగులకు చికిత్స అందించడం లేదని ఆ  ఆసుపత్రి వద్ద పనిచేసే సెక్యూరిటీ కనీసం గేటు కూడ తీయలేదన్నారు ఆమె. ఆ తర్వాత  సెక్టార్ 10లో ఉన్న మున్సిపల్ ఆసుపత్రిలో వద్దకు వెళ్తే అక్కడ కూడ ఆయనను చేర్చుకోలేదని ఆమె గుర్తు చేసుకొన్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: పెళ్లిని వాయిదా వేసుకొన్న మహిళా డిఎస్పీ

ఆ తర్వాత నీరుల్ లో ఉన్న డివై ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ జయదీప్ ను పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్టుగా ప్రకటించిన విషయాన్ని దీపాళి గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. 

డివై ఆసుపత్రికి వెళ్లే సమయానికి సుమారు 30 నిమిషాల సమయాన్ని వృధా చేసినట్టుగా ఆమె చెప్పారు.కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించే క్రమంలో ఇతర అత్యవసర వైద్యులకు సేవలను కూడ నిలిపివేయడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు.లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ నిత్యావసర సరుకులు అందించేందుకు తన భర్త కృషి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

click me!