కరోనా వైరస్ దాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు దీని ప్రభావంతో అతలాకుతలం అయిపోతున్నాయి. భారతదేశంలో కోవిడ్ 19 కారణంగా ఆర్ధిక రంగంతో పాటు సామాజిక రంగంపై దుష్పరిణామాలు కనిపిస్తున్నాయి
కరోనా వైరస్ దాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు దీని ప్రభావంతో అతలాకుతలం అయిపోతున్నాయి. భారతదేశంలో కోవిడ్ 19 కారణంగా ఆర్ధిక రంగంతో పాటు సామాజిక రంగంపై దుష్పరిణామాలు కనిపిస్తున్నాయి.
రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పలువురు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోవడంతో తమ వారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరితనంతో కృంగిపోయి పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆమె ఎడబాటును భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... గోండాలోని రాధా కుండ్ ప్రాంతానికి చెందిన రాకేశ్ సోనికి పెళ్లయ్యింది.
Also Read:కరోనా దెబ్బ: మద్యం అమ్మకాలకు అనుమతివ్వాలంటూ 10 రాష్ట్రాలకు లేఖ
అతని భార్య లాక్‌డౌన్‌కు ముందు ఆమె తల్లిగారింటికి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో ఆమె తిరిగి రాలేదు.
భార్య కోసం ఎదురుచూస్తున్న రాకేశ్ ఆమె రావడం రోజు రోజుకి ఆలస్యం కావడంతో తనలో తానే కుమిలిపోయాడు. ఆమె లేకుండా జీవించడం తన వల్ల కాదని భావిస్తూ, గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Aslo Read:ఇండోర్ లో డాక్టర్ మృతి: ఇండియాలో కరోనాతో మరణించిన తొలి డాక్టర్ ఇతనే
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశంపై ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 11వ తేదీన లాక్‌డౌన్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది.