వ్యాపారులకు యోగి సర్కార్ గుడ్ న్యూస్: షాపుల ఓపెన్‌కు అనుమతి, గైడ్‌లైన్స్ ఇవీ...

By narsimha lode  |  First Published May 19, 2020, 1:49 PM IST

 నాలుగో విడత లాక్ డౌన్ నేపథ్యంలో చిరు వ్యాపారులు, దుకాణాలు, ఫంక్ష్ హాల్స్ యజమానులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో యధావిధిగా కార్యకలాపాలు సాగించుకోవచ్చని స్పష్టం చేసింది. 



లక్నో: నాలుగో విడత లాక్ డౌన్ నేపథ్యంలో చిరు వ్యాపారులు, దుకాణాలు, ఫంక్ష్ హాల్స్ యజమానులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో యధావిధిగా కార్యకలాపాలు సాగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను మంగళవారం నాడు విడుదల చేసింది యోగి సర్కార్.

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతోందని కేంద్రం ప్రకటించింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కూడ ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం.  మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది సర్కార్.

Latest Videos

also read:ట్రక్కు బోల్తా: యూపిలో ముగ్గురు మహిళా వలస కూలీల దుర్మరణం

కంటైన్మెంట్‌ జోన్లు మినహా  ఇతర ప్రాంతాల్లో వీధి వ్యాపారులు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. రెస్టారెంట్లు, స్వీటు షాపులు హోం డెలివరీ చేసుకోవచ్చు.
నిబంధనలకు అనుగుణంగా ఇండస్ట్రీలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని యూపీ ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా షాపులు తెరిచేందుకు అనుమతించినందున ఓనర్లు, కస్టమర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. గ్లోవ్స్‌ ధరించి అమ్మకాలు జరపాలని సూచించింది.. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఈ నిబంధనలు పాటించనట్లయితే దుకాణదార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

రోజు విడిచి రోజు ఒక్కో మార్కెట్‌ తెరవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల యంత్రాంగం వ్యాపార మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మ్యారేజీ హాళ్లు తెరచుకోవచ్చని సూచించింది. అయితే 20 కంటే ఎక్కువ మందిని అనుమతించబోమని తేల్చి చెప్పింది.డ్రైక్లీనింగ్‌ షాపులు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. 

కూరగాయల మార్కెట్లు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  రిటైల్‌ వెజిటబుల్‌ మండీలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు తెరవాలి. వ్యాపారులు ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు వరకు కూరగాయలు అమ్ముకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

వాహనాలకు అనుమతి ఉంటుంది. అయితే కార్లు తదితర వాహనాల్లో డ్రైవర్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. టూ వీలర్లపై ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

మహిళలు అయితే ఇద్దరికి అనుమతి. అయితే తప్పక హెల్మెట్‌, మాస్కు ధరించాలి. త్రీ వీలర్‌లో డ్రైవర్‌ కాకుండా ఇద్దరికి మాత్రమే అనుమతిని ఇచ్చింది యూపీ సర్కార్.ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లను నోయిడా, ఘజియాబాద్‌లో ప్రవేశించేందుకు అనుమతినిస్తాం. అయితే పాసులు ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.


 

click me!