రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ప్రత్యేకించి మహిళలకు

By telugu teamFirst Published Aug 2, 2019, 11:07 AM IST
Highlights

 మహిళా ప్రయాణికుల భద్రతలో భాగంగా వారి కోసం ప్రత్యేక కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కోచ్ లు పింక్ రంగులో ఉంటాయి.

భారత రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త తెలియజేసింది. ప్రత్యేకించి మహిళల కోసం కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది. మహిళా ప్రయాణికుల భద్రతలో భాగంగా వారి కోసం ప్రత్యేక కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కోచ్ లు పింక్ రంగులో ఉంటాయి.

బోగీలపై పింక్ కలర్ లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో ప్రతి ట్రైన్ లో ఒక కోచ్ మహిళల కోసం  కేటాయించిన విషయం తెలిసిందే. మహిళల కోసం కేటాయించిన పింక్ బోగీల్లో ఆడవారు. చిన్న పిల్లలు ఎక్కొచ్చు. నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ జోన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తోంది. 

ఎన్ఎఫ్ఆర్ దాదాపు ఆరు ప్యాసింజరర్ ట్రైన్స్ ఎల్ఎల్ఆర్ కోచ్ లకు పింక్ రంగు వేసింది. ఈ బోగీల్లో కేవలం మహిళలు,పిల్లలు మాత్రమే ప్రయాణించాలనే నిబంధనను పెట్టారు. ఈ విషయంలో ఇండియన్ రైల్వే... మెట్రో ని ఫాలో అవుతోంది.

‘‘మహిళా ప్రయాణికుల భద్రత కోసం మెట్రో దారిలోనే నడుస్తాం. వారికి ప్రత్యేకమైన బోగీలను ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. వీరిలో మహిళలు, పిల్లలు మాత్రమే ప్రయాణించొచ్చు. ఎన్ఎఫ్ఆర్ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే ఇతర ట్రైన్ లకు కూడా దీనిని  వర్తింప చేస్తాం’’ అని రైల్వే శాఖ ట్వీట్ లో పేర్కొంది. 

click me!