ముంబై ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో కుప్పకూలిన లిఫ్ట్.. 14 మందికి గాయాలు

Published : Jun 21, 2023, 04:26 PM IST
ముంబై ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో కుప్పకూలిన లిఫ్ట్.. 14 మందికి గాయాలు

సారాంశం

ముంబై లో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లోని లిఫ్ట్ కుప్పకూలింది. లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అందులో ఉన్న 12-14 మందికి గాయాలు అయ్యాయి. 

ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ కాంపౌండ్ లో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 12-14 మందికి గాయాలయినట్టుగా తెలుస్తోంది. భవనంలోని సి-వింగ్ లో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని బిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది.
నడిరోడ్డు మీద ప్రభుత్వ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్

‘‘కమలా మిల్స్ కాంపౌండ్ లోని ట్రేడ్ వరల్డ్ భవనంలోని సీ వింగ్ నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ కుప్పకూలింది. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 16 అంతస్తుల భవనంగా ఉంది. లిఫ్ట్ కుప్పకూలిన ఘటనలో గాయపడిన వారిని భద్రతా సిబ్బంది రక్షించారు. ’’ అని బీఎంసీ పేర్కొంది.

ఈ ఘటనపై ఉదయం 10.49 గంటలకు ముంబై అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. ప్రస్తుతం క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో కనీసం 12-14 మంది ఉన్నారు. బేస్ మెంట్ లో కూలిపోయిన లిఫ్ట్ లో ఉన్నవారిని బిల్డింగ్ సెక్యూరిటీ సిబ్బంది రక్షించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాల నుంచి డార్విన్ సిద్ధాంతం తొలగింపు.. ? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే ?

గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురిని పరేల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఒకరు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేఈఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలపాలైన మరో నలుగురు ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించారు. గాయపడిన ఎనిమిది మంది ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్