పరువు హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు.. దోషుల్లో నలుగురు సోదరులు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Oct 22, 2022, 1:34 PM IST
Highlights

నాలుగేళ్ల క్రితం జరిగిన పరువు హత్య కేసులో ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురికి జీవిత ఖైదు, పదివేల రూపాయిల జరిమానా విధించింది. ఈ దోషుల్లో నలుగురు సోదరులు ఉన్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో నాలుగేళ్ల క్రితం జరిగిన పరువు హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇందులో మొత్తంగా ఆరుగురి జీవిత ఖైదు విధిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. శిక్ష పడిన దోషుల్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ప్రేమ వివాహమే ఈ ఘటనకు కారణం అయ్యింది. బరేలీలోని అదనపు జిల్లా, సెషన్స్ ప్రత్యేక న్యాయమూర్తి అబ్దుల్ ఖయూమ్ ఈ శిక్షను ఖరారు చేశారు.

110 కిలోమీట‌ర్ల వేగం గాలులతో రాష్ట్రాల‌ను తాక‌నున్న 'సిత్రాంగ్' తుఫాను.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

వివరాలు ఇలా ఉన్నాయి. బరేలీలోని థానా షాహి ప్రాంతంలోని అమౌర్ గ్రామానికి చెందిన ధరంపాల్ మేనళ్లుడు హర్దాస్‌.. కామిని అనే యువతిని ప్రేమించాడు. అయితే వీరి పెళ్లికి యువతి తండ్రి  భువనచంద్ర ఒప్పకోలేదు. దీంతో కొంత మంది యువకులు కలిసి ఈ ప్రేమ జంటకు 2018 జులై 29న వివాహం జరిపించారు. ఈ పెళ్లిని హర్దాస్ మేనమామ ధరంపాల్ , ఇతర గ్రామస్తులు సమర్థించారు. అయితే ఈ విషయం యువతి కుటుంబానికి నచ్చలేదు. 

కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన ఉంటే మొహమాటం లేకుండా వెళ్లిపోవచ్చు.. జైరామ్ రమేష్

ఈ వివాహం జరిగిన రెండు వారాల తరువాత ధరంపాల్ తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో యువతి తండ్రి భువన్ చంద్ర, అతడి సోదరులు రిషిపాల్, హర్పాల్, ఈశ్వరితో పాటు బంధువులు సురేష్ కుమార్, సునీల్ కుమార్ అతడి పొలానికి వెళ్లారు. ధరంపాల్ ను చుట్టుముట్టి హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆగస్టు 14, 2018వ తేదీన జరిగింది. 

కిరాణా షాప్ కు వెళ్లివ‌స్తుండ‌గా వీధికుక్క‌ల దాడి.. ఐదేండ్ల బాలిక మృతి

అతడి మృతదేహాన్ని గమనించిన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ధరంపాల్ భార్య కుసుమ్ దేవి కు జరిగిన ఘటనను వివరించారు. దీంతో ఆమె ఘటనా స్థలానికి చేరుకునే సరికే భర్త చనిపోయి ఉన్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149 , 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితులపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసు: మంత్రులపై స్వప్నా సురేష్ లైంగిక ఆరోపణలు..! 

ఈ కేసులో కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు జరిమానా విధించింది. అందులో సగం డబ్బులు బాధితుడి భార్యకు చెల్లించాలని ఆదేశించింది. 

click me!