ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదేనా? క్లియర్‌గానే వెదర్.. చివరి క్షణాల్లో మేడే కాల్

Published : Oct 22, 2022, 01:31 PM IST
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదేనా? క్లియర్‌గానే వెదర్.. చివరి క్షణాల్లో మేడే కాల్

సారాంశం

శుక్రవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఐదుగురు పైలట్లు మరణించినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో వెదర్ క్లియర్‌గానే ఉన్నదని, పైలట్లు కూడా అపార అనుభవం ఉన్నవారేనని ఆర్మీ తెలిపింది. ఆ పైలట్లు చివరి క్షణంలో ఏటీసీకి మేడే కాల్ చేసినట్టు వివరించింది.  

గువహతి: అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ నిన్న ఉదయం 10.43 గంటలకు కూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పర్ సియాంగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఎలా జరిగిందనే చర్చ నడుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుకు పక్కనే ఉండే రాష్ట్రం కావడంతో అనుమానాలు హెచ్చవడం సాధారణమే. ఆ రాష్ట్రంలో ఎక్కువగా వాతావరణ సమస్యనే ప్రధానంగా ఉంటుందనేది ఎక్కువ మంది వాదన. కానీ, ఈ ప్రమాద సమయంలో వెదర్ క్లియర్‌గానే ఉన్నదని ఆర్మీ తెలిపింది.

ఆ ఆర్మీ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఈ హెలికాప్టర్ క్రాష్ కావడంతో వారంతా మరణించారు. క్రాష్ సైట్‌కు సమీపంగా రోడ్లేవీ లేవు. కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో మూడు టీమ్‌లు స్పాట్‌ వెతుకుతూ వెళ్లాయి. ఆ టీమ్ క్రాష్ సైట్‌ను కనుగొన్నారు. నిన్న నలుగురి డెడ్ బాడీలను గుర్తించినట్టు ఆర్మీ తెలిపింది. ఈ రోజు ఉదయం మరొకరి డెడ్ బాడీ కూడా కనిపించినట్టు తెలిసింది.

Also Read: అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. నాలుగు డెడ్‌బాడీలు లభ్యం.. మరొకరి కోసం గాలింపులు

ఈ క్రాష్ జరగడానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మేడే కాల్ వచ్చినట్టు ఆర్మీ తెలిపింది. కాబట్టి, ఈ ప్రమాదానికి టెక్నికల్ లేదా.. మెకానికల్ ఫెయిల్యూర్ కారణమని అనుకోవచ్చని పేర్కొంది. ఎందుకంటే.. వాతావరణం క్లియర్‌గా ఉన్నదని, పైలట్లు కూడా చాలా అనుభవం ఉన్నవారని వివరించింది. ఆ ప్రాంతం దుర్బేధ్యమైనదని తెలిపింది. దటట్మైన అడవులు, లోయలు, కొండలతో నిండి ఉన్నదని వివరించింది. 

మేడే కాల్ అంటే.. అత్యవసర లేదా.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్‌లోని సిబ్బంది ఏటీసి లేదా గ్రౌండ్ స్టాఫ్‌కు పంపే సిగ్నల్.

పైలట్లకు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్)లను మొత్తంగా 600 గంటలు నడిపిన అనుభవం ఆ పైలట్లకు ఉన్నదని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. సర్వీస్ ఫ్లైయింగ్ అవర్స్ సుమారు 1800 అని వివరించింది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2015 జూన్‌లో సేవల్లోకి తీసుకున్నట్టు వివరించింది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్