ఇకపై పరీక్షల్లో కాపీ కొడితే జీవిత ఖైదు తప్పదు

Published : Feb 12, 2023, 11:03 PM IST
ఇకపై పరీక్షల్లో కాపీ కొడితే జీవిత ఖైదు తప్పదు

సారాంశం

Uttarakhand: ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షల్లో మోసానికి పాల్పడితే.. ఇకపై జీవిత ఖైదు లేదా పదేళ్ల కారాగార శిక్ష విధిస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హెచ్చరించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని రూపొందించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో వరుసగా పేపర్లు లీకయ్యాయి.

Uttarakhand: ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరుస పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ స్కాంలు జరుగుతున్నాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోపించిన రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తన వైఖరిని వ్యక్తం చేసింది. ఇక నుంచి పరీక్షలలో కాపీ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామనీ, పరీక్షలలో కాపీ చేసిన వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన ప్రకటన చేశారు.

యువత కలలు, ఆకాంక్షలతో తమ ప్రభుత్వం రాజీపడదని, ఇప్పుడు రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఎవరైనా మోసానికి పాల్పడితే .. వారికి జీవిత ఖైదు, లేదా 10 ఏళ్ల జైలుశిక్ష విధించబడుతుందని వెల్లడించారు. అంతేకాకుండా.. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు. కల్సిలో జరిగిన క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవంలో ప్రసంగిస్తూ .. ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.

ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ శుక్రవారం ఉత్తరాఖండ్ పోటీ పరీక్ష (రిక్రూట్‌మెంట్‌లో అన్యాయమైన మార్గాల నివారణ,పరిష్కారానికి చర్యలు) ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు, దీనిని కాపీయింగ్ నిరోధక ఆర్డినెన్స్ అని పిలుస్తారు. రాష్ట్రంలో పేపర్ లీక్ కేసులపై విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లు సీఎం స్వయంగా ప్రకటించారు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టంగా మారింది.

రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గత వారం, రాష్ట్రంలోని నిరుద్యోగులకు చెందిన బెరోజ్‌గర్ సంఘ్‌కు చెందిన యువత డెహ్రాడూన్‌లోని ప్రధాన రాజ్‌పూర్ రోడ్‌లో నిరసన చేపట్టారు. ఆర్డర్‌ను అమలు చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకారులు పోలీసుల రాళ్లు రువ్వారు, ప్రదర్శన సమయంలో వాహనాలను ధ్వంసం చేశారు. ప్రదర్శన సందర్భంగా రాళ్లదాడి చేశారన్న ఆరోపణలపై బెరోజ్‌గర్ సంఘ్ అధ్యక్షుడు బాబీ పన్వార్‌తో సహా 13 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. రాళ్ల దాడి ఘటనలో మొత్తం 15 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. కల్సి ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చిందని, యువత భవిష్యత్తును దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎవరిని వీడిచి పెట్టబోమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!