ప్రభుత్వ భూమిని ఆక్రమించావ్.. : హనుమంతుడికి రైల్వే శాఖ నోటీసులు

Published : Feb 12, 2023, 07:43 PM IST
ప్రభుత్వ భూమిని ఆక్రమించావ్.. : హనుమంతుడికి రైల్వే శాఖ నోటీసులు

సారాంశం

రైల్వే శాఖ ఏకంగా హనుమంతుడికే నోటీసులు పంపి.. భూమి ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని పేర్కొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  

భోపాల్: రైల్వే శాఖ ఏకంగా హనుమంతుడికే నోటీసులు పంపింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించావని ఓ నోటీసును హనుమంతుడి గుడికి అతికించేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో చోటుచేసుకుంది.

ఆక్రమిత భూభాగంలో నుంచి హనుమంతుడి ఆలయాన్ని తొలగించకుంటే జిల్లా అధికారులే యాక్షన్ తీసుకుని ఆ గుడిని తొలగిస్తారని నోటీసులో పేర్కొన్నారు. మొరేనా జిల్లా సబల్‌గడ్ ఏరియాలో ఓ టెంపుల్ ఉన్నది. ఆ భూమి ప్రభుత్వ స్థలం అని రైల్వే శాఖ పేర్కొంటున్నది. మొరేనా జిల్లాలో బ్రాడ్ గేట్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భూమిలో ఆక్రమణ అధికారుల దృష్టికి వచ్చింది.

అంతేకాదు, ఆ నిర్మాణం కూల్చివేయడానికి అయ్యే ఖర్చులను కూడా హనుమంతుడి నుంచే రికవరీ చేసుకుంటారని అధికారులు ఆ నోటీసులో తెలిపారు.

Also Read: అల్లా, ఓం.. రెండూ సేమ్! దుమారం రేపుతున్న జామియత్ చీఫ్ మహమూద్ మదానీ వ్యాఖ్యలు

నార్త్ సెంట్రల్ రైల్వే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆ నోటీసును పొరపాటుగా హనుమంతుడి పేరు మీద జారీ చేసినట్టు వివరించారు. త్వరలోనే ఆ గుడి పూజారి పేరిట నోటీసు పంపిస్తామని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?