మా కూతుళ్లను హిజాబ్‌ ధరించనివ్వండి.. మీరు బికినీలు ధరించండి - ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

Published : Oct 14, 2022, 04:30 PM IST
మా కూతుళ్లను హిజాబ్‌ ధరించనివ్వండి.. మీరు బికినీలు ధరించండి - ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

తమ కూతుర్లను స్వేచ్ఛగా హిజాబ్ ధరించనివ్వాలని, అవసరమైతే మీరు బికినీలు ధరించాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం సుప్రీంకోర్టు హిజాబ్ పై తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లిం బాలికల హిజాబ్‌ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందని ఆయన మండిపడ్డారు. “ముస్లింలు చిన్న పిల్లలను హిజాబ్ ధరించమని బలవంతం చేస్తున్నారని వారు అంటున్నారు. మేము నిజంగా మా అమ్మాయిలను బలవంతం చేస్తున్నామా? ’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి, మీకు నచ్చితే మీరు మీ బికినీలు ధరించండి...’’ అని అన్నారు.

మోడీకి జన్మనివ్వడమే ఆమె చేసిన తప్పు.. ప్రధాని తల్లిని ఎగతాళి చేసినందుకు ఆప్ పై తీవ్రంగా విరుచుకుపడిన బీజేపీ

గోల్కొండ కోటలో ఒక సభతో తన ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన హిజాబ్ అంశాన్ని ప్రస్తావించారు. హిజాబ్ ముస్లింల వెనుకబాటుతనాన్ని చూపుతుందా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలు దేశ అభివృద్ధికి సహకరించడం లేదా అని అన్నారు. “మీరు హైదరాబాద్‌కు వస్తే మా అక్కాచెల్లెళ్లలో పేరుమోసిన డ్రైవర్లను చూస్తారు ’’ అని అన్నారు. 

కర్నాటక హిజాబ్ నిషేధాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ ఒక హిందువు, సిక్కు, క్రైస్తవ విద్యార్థిని వారి మతపరమైన దుస్తులతో తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. కానీ ఒక ముస్లింను ఆపుతున్నారు. ఆ సమయంలో మిగితా విద్యార్థులు ముస్లిం విద్యార్థి గురించి ఏమనుకుంటున్నారు? సహజంగానే వారు ముస్లింలు మనకంటే దిగువన ఉన్నారని అనుకుంటారు. ’’ అని అన్నారు.

నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, షెడ్యూల్ ఇదే.. 80 ఏళ్లు నిండితే ఇంటి నుంచే ఓటు

కర్ణాటక హిజాబ్ నిషేధం కేసులో సుప్రీంకోర్టు గురువారం అస్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరు కొట్టివేయగా, మరొకరు స్వాగతించారు. పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివిధ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ మఠాధిపతిపై మాపైనా లైంగికదాడులు చేశాడు.. నలుగురు మైనర్ బాలికల ఆరోపణలు.. కేసు నమోదు

ఈ ఏడాది జనవరిలో ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు బాలికలను లోనికి రానీయకుండా నిషేధించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీంతో కాలేజీలో ప్రవేశం నిరాకరిస్తూ బాలికలు కళాశాల బయట బైఠాయించి నిరసన తెలిపారు. తరువాత ఉడిపిలోని అనేక కళాశాలల నుండి బాలురు కాషాయ కండువాలు ధరించి తరగతులకు హాజరు కావడం ప్రారంభించారు. ఈ నిరసన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో పాటు కర్ణాటకలోని అనేక చోట్ల నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఫలితంగా, కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంకు కట్టుబడి ఉండాలని చెప్పింది. నిపుణుల కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకునే వరకు హిజాబ్, కాషాయ కండువాలు రెండింటినీ నిషేధించింది.

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?