సచివాలయంలో చిరుతపులి కలకలం

Published : Nov 05, 2018, 12:38 PM IST
సచివాలయంలో చిరుతపులి కలకలం

సారాంశం

సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. ఏడో నెంబర్ గేటు నుంచి చిరుతపులి లోపలికి రావడం అక్కడ ఉన్న సీసీకెమేరాల్లో రికార్డు అయ్యింది.

సచివాలయంలో చిరుతపులి కలకలం రేపిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర సచివాలయంలోనికి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. ఏడో నెంబర్ గేటు నుంచి చిరుతపులి లోపలికి రావడం అక్కడ ఉన్న సీసీకెమేరాల్లో రికార్డు అయ్యింది. కాగా.. లోపలికి వచ్చిన చిరుత వెంటనే.. మరో గేటు నుంచి బయటకు వెళ్లినట్లు రికార్డెడ్ వీడియో ద్వారా తెలుస్తోంది.

అయితే.. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికారుల వెంట చిరుతను పట్టుకునేందుకు బోన్లు, మత్తుమందు ఇంజెక్షన్లు ఇచ్చే తుపాకులు ఉన్నాయి.

గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇంకా చిరుత ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో అవనీ అనే ఆడపులిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే