నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం: మహిళల ప్రవేశంపై చేతులెత్తేసిన లెఫ్ట్ ప్రభుత్వం

Published : Nov 16, 2019, 11:41 AM ISTUpdated : Nov 16, 2019, 05:15 PM IST
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం: మహిళల ప్రవేశంపై చేతులెత్తేసిన లెఫ్ట్ ప్రభుత్వం

సారాంశం

శబరిమల కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన క్రమంలో.. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంపై గందరగోళం నెలకొంది. గురువారం తీర్పులో స్పష్టత లేకపోవడంతో మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహించకూడదని కేరళ సర్కార్ నిర్ణయించింది. 

శబరిమల కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన క్రమంలో.. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంపై గందరగోళం నెలకొంది. గురువారం తీర్పులో స్పష్టత లేకపోవడంతో మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహించకూడదని కేరళ సర్కార్ నిర్ణయించింది. 

నేడు శబరిమల ఆలయ తలుపులనుఈ తెరిచి మండల పూజ నిర్వహిస్తారు. రేపటి నుండి భక్తులను అనుమతిస్తారు. తీర్పుపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే యువతులను అనుమతించే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలా నిషేధిత వయసులో ఉన్న మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహించే ఏ నిర్ణయం అయినా రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా, మాత పరమైన సంస్థలకు హింసకు తెగబడే అవకాశం ఇస్తుందని అభిప్రాయపడింది.

Also read: Sabarimala case: స్టేకు సుప్రీం నిరాకరణ, విస్తృత ధర్మాసనానికి కేసు

సిపిఎం సెక్రటేరియట్ సభ్యుడు, న్యాయ మంత్రి ఎ.కె. బాలన్ ఈ తీర్పుపై కోర్టుకు కూడా స్పష్టత లేదని అన్నారు. “ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తే, వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఎవరినీ అనుమతించదు,”అని అన్నారు.

కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించే మహిళలు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తారని అభిప్రాయపడ్డారు. యాక్టివిజం ప్రదర్శించడానికి కొందరు వ్యక్తులు శబరిమలను వేదికగా ఎంచుకుంటామంటే కుదరదని, కొందరు ఏకంగా ప్రెస్ మీట్లు నిర్వహించి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదన్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని అన్నారు.  

ఒకవేళ ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే సుప్రీంకోర్టు తీర్పు పత్రాలను కూడా తెచ్చుకోవాలని, అవి చూపెడితే మాత్రమే అనుమతిస్తామని అన్నారు. శబరిమల తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళతామన్నారు. 

కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసులోని మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పిస్తూ, గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత సంవత్సరం  తీర్పునిచ్చిన విషయం తెలిసిందే! దీంతో హిందుత్వ సంస్థలు, సంఘ్‌పరివార్‌ తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. మతపరమైన అంశాల్లో కోర్టు తలదూర్చడమేంటని వారక్కడ భారీ స్థాయిలో మోహరించి మహిళలను అడ్డుకున్నారు. 

Also read: మళ్లీ శబరిమలకు ఆ ఇద్దరు

ఈ క్రమంలో తీర్పును పునః సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం గురువారం సమీక్షించి, ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులున్న విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీచేసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమల  వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు. ముస్లిం మహిళలకు మసీదుల్లో ప్రవేశం, పార్శీ మహిళలు ఇతర మతస్థులను పెళ్లి చేసుకుంటే మాత బహిష్కరణకు గురవ్వడం మొదలగు వివక్షలనూ పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?