గాంధీ ప్రమాదంలో చనిపోయారట: ఒడిషా ప్రభుత్వ బుక్‌లెట్, మేథావుల విమర్శలు

By sivanagaprasad KodatiFirst Published Nov 15, 2019, 9:55 PM IST
Highlights

గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యాశాఖ పుస్తకాల్లో ప్రచురించడం పెద్ద దుమారాన్ని రేపింది. 

జాతిపిత మహాత్మా గాంధీని ఎలా చనిపోయారో.. ఎవరు చంపారో భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసు. గుజరాత్‌లోని సబర్మాతీ తీరంలో అక్టోబర్ 30, 1948న నాథూరాం గాడ్సే... మహాత్ముడిని కాల్చి చంపాడు. అయితే గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యాశాఖ పుస్తకాల్లో ప్రచురించడం పెద్ద దుమారాన్ని రేపింది.

మేధావులు, సామాజిక వేత్తలు, రాజకీయ వర్గాల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని.. తప్పును వెంటనే సరిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ఓ రెండు పేజీల బుక్‌లెట్‌లో మహాత్మాగాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదవశాత్తూ మరణించినట్లు పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

Also Read:మోడీ మరో సంస్కరణ: వన్ నేషన్.. వన్ పే డే, ఫస్ట్ కల్లా వేతనాలు

దీనిపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ.. పుస్తకంలో వివాదానికి దారి తీసిన అంశం ఎలా ప్రచురించారనే విషయంపై విచారణకు ఆదేశించామన్నారు.

బుక్‌లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశదీకరించారని మంత్రి పేర్కొన్నారు.  ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఉపసంహరించుకున్నామని దాస్ స్పష్టం చేశారు.

అటు మేధావులు సైతం ప్రభుత్వం తీరును విమర్శించారు. గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ బుక్‌ను ప్రచురించారని సామాజిక కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర ధ్వజమెత్తారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో బాపూజీ హత్యకు గురయ్యారని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

గాంధీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తున్నామని చెబుతూ.. ఇలా అవమానించడం సరికాదన్నారు. అటు శుక్రవారం జరిగిన ఒడిషా అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది.

Also Read:రాఫెల్ విమానాల డీల్ కేంద్రానికి ఊరట: టైమ్ లైన్...

గాంధీని గాడ్సే హత్య చేశాడని.. అనంతరం అతనిని చట్ట ప్రకారం ఉరి తీశారని తెలీదా అని సీఎల్పీ నేత నరసింహ్ మిశ్రా ప్రశ్నించారు. మీరు చరిత్రను తిరిగరాయాలని అనుకుంటున్నారా..ఈ తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సదరు బ్రోచర్ విషయంలో సీఎం నవీన్ పట్నాయక్‌కే భాగస్వామ్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని మిశ్రా డిమాండ్ చేశారు. నాథూరాం గాడ్సేని బీజేపీలోని కొందరు నేతలు దేవుడిలా భావిస్తున్నారని... ఒడిషా ప్రభుత్వం తీరు చూస్తుంటే బీజేడీ కూడా ఆ భావజాల ప్రభావానికి లొంగిపోయినట్లుగా ఉందన్నారు.

అయితే ప్రతిపక్షం వ్యాఖ్యల్ని బీజేడీ నేత సౌమ్య రంజన్ మిశ్రా ఖండించారు. చరిత్రను ఎవరు మార్చలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై గందరగోళం నెలకానడంతో శనివారం వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ సూర్యనారాయణ పాత్రో ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

click me!