గుండెనొప్పితో గోవా డీజీపీ ప్రణనబ్ నందా మృతి

By telugu teamFirst Published Nov 16, 2019, 11:39 AM IST
Highlights

1988వ సంత్సరంలో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 


గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ప్రణబ్ నందా కన్నుమూశారు.  శనివారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీలో తుది శ్వాస విడిచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  1988వ సంత్సరంలో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 

కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి.  ప్రణబ్ నంద ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చేశారు.  అనంతరం సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

click me!