ఇంటర్ విద్యార్థితో మహిళా లెక్చరర్ జంప్, వివాహం చేసుకుని.. బాలుడి మిస్సింగ్ కేసులో ట్విస్ట్...

Published : Mar 26, 2022, 07:02 AM IST
ఇంటర్ విద్యార్థితో మహిళా లెక్చరర్ జంప్, వివాహం చేసుకుని.. బాలుడి మిస్సింగ్ కేసులో ట్విస్ట్...

సారాంశం

తన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న మైనర్ కు ప్రేమ పాఠాలు నేర్పిందో లెక్చరర్. అంతటితో ఆగకుండా ఆ కుర్రాడితో పారిపోయింది. ఇది తెలియని ఆ బాలుడి ఇంట్లో వాళ్లు అతను కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు... దీంతో..

తిరుచ్చి : Intermediate చదువుతున్న విద్యార్థితో ఓ lecturer పరారై వివాహం చేసుకున్న ఘటన tamilnaduలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన యువకుడి తల్లిదండ్రులు కుమారుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా... ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు పోలీసులనూ ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. 

విద్యార్థిలాగే అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ 26 ఏళ్ల షర్మిల కూడా అదృశ్యం కావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. షర్మిల ఆ బాలుడిని ప్రేమించి, తీసుకెళ్లి, పెళ్లి చేసుకుందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో పంజాబ్ లో కలకలం రేపింది. పంజాబ్, హర్యానాలో ఓ ట్యూషన్ టీచర్ టీనేజ్ విద్యార్థితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా అన్నీ ఆన్ లైన్ క్లాసులు అయిపోయాయి. ఆన్ లైన్ లో క్లాసులు నేర్చుకునేవాళ్లు కొందరైతే.. ట్యూషన్ టీచర్లద్వారా పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నావారు మరికొందరు. ఇదే ఆ తల్లిదండ్రుల కొంపముంచింది. వివరాల్లోకి వెడితే.. పానిపట్ కు చెందిన ఓ కుటుంబం, తమ 17యేళ్ల కొడుకుకు ట్యూషన్ చెప్పడానికి 20యేళ్ల వయసున్న మహిళా టీచర్ ను నియమించారు. 

గత మూడు నెలలుగా ఆమె ప్రతిరోజూ ఇంటికి వచ్చి అతడికి ట్యూషన్ చెబుతుంది. రోజూ నాలుగు గంటలపాటు ట్యూషన్ సాగుతుంది. ఈ క్రమంలో మే 29న ఆ అబ్బాయి ఇంటికి దగ్గర్లో ఉన్న దేస్రాజ్ కాలనీలో ఉండే ట్యూషన్ టీచర్ ఇంటికి వెడుతున్నానని చెప్పి వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. కొడుకుకు ఫోన్ చేస్తే స్విఛాప్ వస్తుంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కొడుకు కోసం వాకబు చేస్తే.. తమ కొడుకే కాదు వాళ్ల కూతురైన సదరు టీచర్ కూడా కనిపించడం లేదని తెలిసింది.

టీచర్ తల్లిదండ్రులు తమ కూతురు కూడా కనిపించడంలేదంటూ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ టీచర్ మీద మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆ టీచర్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి రాణా ప్రతాప్ తెలిపారు. అయితే ఆ టీచర్ కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వీరిద్దరూ ఇంట్లోనుంచి వెళ్లేటప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకువెళ్లలేదని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !