అనంత్‌నాగ్‌ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ కమాండర్ ఉజైర్ ఖాన్ హతం...

By SumaBala BukkaFirst Published Sep 19, 2023, 4:05 PM IST
Highlights

లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ మంగళవారం అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌ లో హతమయ్యాడని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఎన్ కౌంటర్ కు ముగింపు పలికినట్లైంది. 

అనంత్ నాగ్ : లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ మంగళవారం హతమయ్యాడు. అతని మృతితో 7 రోజుల అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లయ్యిందని ఒక అధికారి తెలిపారు. హతమైన ఉగ్రవాది నుంచి మరో వ్యక్తి మృతదేహంతో పాటు ఆయుధాన్ని కూడా భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. 

ఉజైర్ ఖాన్ మరణంతో ఏడు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్ ముగిసినట్లు అధికారి ప్రకటించారు. “ఎల్ఈటీ కమాండర్ ఉజైర్ ఖాన్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో చంపబడ్డాడు. అదనంగా మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమైంది. అనంత్‌నాగ్‌ ఎన్‌కౌంటర్‌ ముగిసింది' అని ఏడీజీపీ పోలీస్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

‘‘ నేను ఇంక బతకను, బిడ్డను జాగ్రత్తగా చూసుకో ’’ : చివరిసారిగా భార్యకు పోలీస్ అధికారి వీడియో కాల్

ఇదిలా ఉండగా,జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీ హుమాయున్ భట్ వీరమరణం పొందారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ తగిలిన వెంటనే డీఎస్పీ హుమాయూన్ తన భార్య ఫాతిమాకు వీడియో కాల్ చేశారు. ‘‘తాను ఇక బతకనని, కొడుకుని జాగ్రత్తగా చూసుకో’’ అని చివరి మాటలు మాట్లాడారు. 

డీఎస్పీ హుమాయున్‌‌కు కడుపు భాగంలో బుల్లెట్ దూసుకెళ్లింది. హుమాయున్ గాయపడి పడి ఉన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు హెలికాప్టర్‌కు సమయం పట్టిందని అతని అత్తయ్య సయ్యద్ నుస్రత్ చెప్పారు. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి సంఘటనా స్థలం నుండి నేరుగా శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఫాతిమా , అతని 29 రోజుల కొడుకును చూసిన తర్వాత హుమాయున్ కన్నుమూశారు. 

click me!