మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు.. 4గురు మృతి...

Published : Jul 20, 2023, 08:02 AM IST
మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు.. 4గురు మృతి...

సారాంశం

భారీ వర్షాలతో మహారాష్ట్రలోని రాయగఢ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 30 కుటుంబాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 4గురు మృతి చెందారు. 

ముంబై : మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో నిన్న అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు చిక్కుకు పోయాయి. గిరిజన కుగ్రామానికి చెందిన పలు ఇళ్లు ఉన్న ఖలాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా వారిలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 21 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన రెండు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో చేరేందుకు ముంబై నుంచి మరో రెండు బృందాలు బయలుదేరాయి.

చిత్రకూట్ జలపాతం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం.. 90 అడుగుల ఎత్తునుంచి దూకి..

"ఉదయం వెలుగు ఉన్నప్పుడు అయితే పరిస్థితి గురించి మాకు సరైన అంచనా వస్తుంది. ప్రస్తుతం పోలీసులు, జిల్లా యంత్రాంగం నుండి 100 మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానికులు, కొన్ని ఎన్ జీఓల నుండి కూడా సహాయం తీసుకుంటున్నాం" అని రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు. 

మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని ఆరు ప్రధాన నదులలో రెండు, సావిత్రి, పాతాళగనగ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కుండలిక, అంబా నదులు 'అలర్ట్' మార్కుకు చేరుకున్నాయి. గాధి, ఉల్హాస్ 'అలర్ట్' మార్కుకు దగ్గరగా ప్రవహిస్తున్నాయని జిల్లా పరిపాలనాధికారులు చెబుతున్నారు.

వరద సహాయక చర్యలలో సహాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ మహారాష్ట్ర అంతటా 12 బృందాలను మోహరించింది. ముంబైలో ఐదు బృందాలు, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, నాగ్‌పూర్ మరియు థానేలో ఒక్కొక్క టీమ్‌ను మోహరించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, భారీ వర్షం కారణంగా ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?
8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?