ఘోర రోడ్డు ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన కారు.. 9మంది మృతి, 15 మందికి పైగా గాయాలు..

Published : Jul 20, 2023, 07:37 AM IST
 ఘోర రోడ్డు ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన కారు.. 9మంది మృతి, 15 మందికి పైగా గాయాలు..

సారాంశం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కాగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. ఇస్కాన్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి థార్ వాహనం , డంపర్ లు ఢీకొన్నాయి. ప్రమాదాన్ని చూసేందుకు వంతెనపై జనం గుమిగూడారు. ఇంతలో అతివేగంతో దూసుకొచ్చిన జాగ్వార్ కారు అక్కడ ఉన్నవారిపైకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు.

బుధవారం-గురువారం మధ్య రాత్రి సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్‌పై మహీంద్రా థార్ వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా, అతివేగంతో దూసుకొచ్చిన కారు జనాన్ని తొక్కేసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. డబుల్ ప్రమాదం జరగడంతో, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు ఇస్కాన్ వంతెన మొత్తాన్ని మూసివేశారు.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !