Coronavirus: ఈ నెలాఖరు తర్వాత దేశవ్యాప్తంగా కొవిడ్ నిబంధనల ఎత్తివేత.. కానీ, అవి అమలవుతాయ్!

Published : Mar 23, 2022, 02:25 PM ISTUpdated : Mar 23, 2022, 03:19 PM IST
Coronavirus: ఈ నెలాఖరు తర్వాత దేశవ్యాప్తంగా కొవిడ్ నిబంధనల ఎత్తివేత.. కానీ, అవి అమలవుతాయ్!

సారాంశం

దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ చట్టం 2005ను ఇకపై పొడిగించాల్సిన అవసరం లేదని, ఈ చట్టం కింద నిబంధనలను ఎత్తేస్తామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ వెల్లడించింది. కరోనా కట్టడి కోసం ఈ చట్టం కింద నిబంధనలు ఇకపై కొనసాగవని, కానీ, కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు యథావిధిగా అమల్లోనే ఉంటాయి.  

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు వెనుకంజ పట్టాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులు అదుపులో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఎత్తేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరు అంటే మార్చి 31వ తేదీ నుంచి విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎత్తేయాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ వెల్లడించింది. కరోనా మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత కట్టడి నిబంధనల కోసం 2020 మార్చ్ నెలలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను అమలు చేసింది. అప్పటి నుంచి పలుమార్లు దీన్ని పొడిగిస్తూ వచ్చింది. కానీ, ఈ నెలాఖరు వరకు ఈ యాక్ట్ అమల్లో ఉన్నది. కానీ, ఆ తర్వాత ఈ చట్టాన్ని మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ వంటి అంశాలు ఈ చట్టం కిందకు వస్తాయి. కేంద్ర హోం శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఎత్తేసినప్పటికీ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అమలు చేస్తున్న మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి గైడ్‌లైన్స్ మాత్రం అమల్లోనే ఉంటాయని ఆయన తన లేఖలో వివరించారు.

కరోనా మహమ్మారిని అదుపులోకి తేవడానికి కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వెలెన్స్, వ్యాక్సినేషన్, హాస్పిటల్ సదుపాయాలు వంటి నిర్వహణ సామర్థ్యాలు ఇప్పటికే అభివృద్ధి అయ్యాయని, కాబట్టి, ఇకపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పుడు ప్రజల్లోనూ కరోనా మహమ్మారిపై అవగాహన ఎక్కువగానే ఉన్నదని వివరించారు. కాబట్టి, కరోనా మహమ్మారిని అదుపులోకి తేవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వయంగా సామర్థ్యాలను పెంపొందించుకుని ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఫేస్ మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు అమల్లోనే ఉంటాయి. కాబట్టి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆదేశాలు జారీ చేయడాన్ని విరమించుకోవాలని ఆయన తెలిపారు. అయితే, ఒక వేళ కేసులు పెరిగితే ప్రభుత్వాలు స్థానికంగా నిబంధనలు విధించే నిర్ణక్ష్ాన్ని తీసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం చాలా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే భారత్ మాత్రం కరోనాతో విజయవంతంగా పోరాడింది. దీనికి ప్రధాన కారణం వ్యాక్సినేషన్ డ్రైవ్. దీంతో ప్రపంచం దృష్టి భారత్‌పై పడింది. అంతేకాదు పలువురు దేశాధినేతలు కోవిడ్‌పై భారత్ పోరాటాన్ని, టీకా ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు.  బిల్‌గేట్స్, మెలిందా ఫౌండేషన్ (bill gates and melinda gates foundation) నిర్వహిస్తున్న ‘‘అక్ష’’ కార్యక్రమంలో ఇతర దేశాలు కరోనా పోరాటాన్ని స్వీకరించాలని యునిసెఫ్ (unicef) , ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organization) , ఆసియన్ డెవలప్‌మెంట్ (asian development bank) బ్యాంక్‌లకు పలువురు ప్రపంచ నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో భారత్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠశాలకు సంబంధించి ఇవాళ ఓ కార్యక్రమం నిర్వహించారు. యునిసెఫ్ ప్రాంతీయ అధిపతి, ప్రైవేట్ నిధుల సేకరణ అధికారి యుసుమాసా కిమురా భారత్‌ను అభినందించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి తన పౌరులు భారత్ కోవిడ్ నుంచి రక్షించుకుందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ఇతర దేశాలకు కూడా సహాయపడిందని కిమురా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం