పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. ఎన్నికల డ్రామానే, చేయాల్సింది ఇలా కాదు: లాలూ

Siva Kodati |  
Published : Nov 04, 2021, 07:56 PM ISTUpdated : Nov 04, 2021, 08:05 PM IST
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. ఎన్నికల డ్రామానే, చేయాల్సింది ఇలా కాదు: లాలూ

సారాంశం

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol and Diesel Price Cut) ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) (rjd) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) తనదైన స్టైల్లో స్పందించారు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol and Diesel Price Cut) ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) (rjd) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) తనదైన స్టైల్లో స్పందించారు. సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలగదని.. దానిని రూ.50 వరకు తగ్గిస్తేనే జనానికి మేలని లాలూ అన్నారు. ఇదంతా డ్రామా అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తగ్గించినట్టు చెప్పినా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (up polls) తర్వాత మళ్లీ పెంచుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. మోడీ ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకం సరిపోదని.. మరింత తగ్గించాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. కాగా.. ఆరోగ్యం బాగలేకపోవడంతో.. పరీక్షలు చేయించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా లాలూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel Price) పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వాహనాదారులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంది కొంతమేర ఊరట కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ALso Read:పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. ఎన్నికల భయంతోనే ఈ నిర్ణయం: కేంద్రంపై ప్రియాంక విమర్శలు

ఇదిలా ఉంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. ఈ తగ్గిన ధరలు నవంబర్ 4 నుంచే అమల్లోకి రానున్నాయి. 

అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి. దీంతో అక్కడ మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 12, డీజిల్‌పై రూ. 17 తగ్గినట్టు అయింది. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ. 2 తగ్గిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను తగ్గించేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్ (himachal pradesh) ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ (jairam thakur) తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu