అధికారులు కిలోమీటరు పరుగెత్తి పట్టుకున్నారు.. తీరా చూస్తే పోలీసు అధికారే నిందితుడు

Published : Nov 04, 2021, 07:38 PM IST
అధికారులు కిలోమీటరు పరుగెత్తి పట్టుకున్నారు.. తీరా చూస్తే పోలీసు అధికారే నిందితుడు

సారాంశం

కర్ణాటకలో అనూహ్య ఘటన జరిగింది. యాంటీ కరప్షన్ అధికారులు ఓ ఎస్ఐనే ఛేజ్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. అవినీతి కేసులో ఏసీబీ అప్పటికే కానిస్టేబుల్‌ను కస్టడీలోకి తీసుకుంది. పోలీసు స్టేషన్ చేరగానే ఆ ఎస్ఐ తన యూనిఫామ్ షర్ట్ డస్ట్ బిన్‌లో పడేసి పరుగులంకించుకున్నాడు. సుమారు ఒక కిలోమీటరు మేర పరుగెత్తి ఆయనను పట్టుకున్నారు.  

బెంగళూరు: Karnatakaలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా Policeలు ఛేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. కానీ, కర్ణాటకలో అధికారులే ఓ నిందితుడిని Chase చేసి పట్టుకున్నారు. ఇంతకీ ఆ నిందితుడు ఎవరో కాదు.. ఓ పోలీసు అధికారే. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో బుధవారం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక గుబ్బిన్ తాలూకాలోని పోలీసు స్టేషన్‌లో చంద్రేశఖర్ పొరా పోలీసు స్టేషన్‌లో సోమెశేఖర్ ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుమకూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ పోలీసు స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌లో ఇటీవలే ఓ ఫ్యామిలీ లిటిగేషన్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఓ వ్యక్తి చంద్రన్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ వాహనం ఇవ్వాలంటే రూ. 28వేలు లంచం ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను ఎస్ఐ సోమెశేఖర్ చెప్పారు.

రూ. 28వేల Bribe అడగ్గానే చంద్రన్న అదిరిపోయాడు. ఆయన యాంటీ కరప్షన్ బ్యూరో(ACB)ను ఆశ్రయించాడు. తన వాహనాన్ని విడుదల చేయాలంటే రూ. 28వేలు లంచం అడుగుతున్నారని తెలిపాడు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మీ ముందస్తుగా ఓ పథకం వేసింది.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

చంద్రన్న రూ. 12వేలు కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌కు ఇచ్చాడు. విజయలక్ష్మీ నేతృత్వంలోని ఏసీబీ టీమ్ కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుంది. ఆయనను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఈ విషయం తెలియగానే ఎస్ఐ సోమెశేఖర్ వెంటనే అలర్ట్ అయ్యారు. తన యూనిఫామ్ షర్ట్‌ను డస్ట్ బిన్‌లో పడేశాడు. పోలీసు స్టేషన్ నుంచి పరుగు లంకించుకున్నాడు.

ఏసీబీ అధికారులు ఇది గమనించారు. వెంటనే వారూ పరుగు అందుకున్నారు. ఎస్ఐ సోమెశేఖర్‌ను ఛేజ్ చేస్తూ వెంబడించారు. కనీసం ఒక కిలోమీటర్ ఆయన వెంటే పరుగు తీశారు. అప్పుడు సోమెశేఖర్‌ను పట్టుకోగలిగారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu