పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. ఎన్నికల భయంతోనే ఈ నిర్ణయం: కేంద్రంపై ప్రియాంక విమర్శలు

By Siva KodatiFirst Published Nov 4, 2021, 7:19 PM IST
Highlights

పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గించడంపై కాంగ్రెస్ (congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (priyanka gandhi) స్పందించారు. కేవలం ఎన్నికల భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రియాంక దుయ్యబట్టారు. ఈ దోపిడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెపుతారని ఆమె జోస్యం చెప్పారు

దీపావళి (deepavali) కానుకగా పెట్రోల్ (petrol) , డీజిల్‌పై (diesel) కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గించిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 5, లీటర్ డీజిల్ పై రూ. 10 సుంకాన్ని తగ్గించింది. దీంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించినట్టయింది. పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గించడంపై కాంగ్రెస్ (congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (priyanka gandhi) స్పందించారు.  కేవలం ఎన్నికల భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రియాంక దుయ్యబట్టారు. ఈ దోపిడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెపుతారని ఆమె జోస్యం చెప్పారు. కాగా.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఆమె నిప్పులు చెరిగారు.

కాగా.. దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel Price) పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వాహనాదారులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంది కొంతమేర ఊరట కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో..  రెండింటిపై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలు చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 120కి చేరగా, కొన్ని మెట్రో నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ. 100 దాటింది. 

Fuel Rates: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు తగ్గింపులు ప్రకటించిన 9 రాష్ట్రాలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98కే..

ఇదిలా ఉంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. ఈ తగ్గిన ధరలు నవంబర్ 4 నుంచే అమల్లోకి రానున్నాయి. 

అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి. దీంతో అక్కడ మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 12, డీజిల్‌పై రూ. 17 తగ్గినట్టు అయింది. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ. 2 తగ్గిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను తగ్గించేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్ (himachal pradesh) ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ (jairam thakur) తెలిపారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దీపావళి కానుక.. కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 5, లీటర్ డీజిల్‌పై రూ. 10 తగ్గించింది. త్రిపుర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను అదనంగా రూ. 7 తగ్గిస్తుంది. ఈ నిర్ణయం తర్వాత అగర్తలాలో లీటర్ పెట్రోల్ రూ. 98.33, డీజిల్ రూ. 85.63 అవుతుంది’ అని త్రిపుర (tripura) ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ (biplav kumar deb) ట్వీట్ చేశారు. 


 

click me!