లఖింపూర్ ఖేరీ కేసు.. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై రెండు వారాల్లో స్పందన తెలియజేయాలని యూపీకి సుప్రీం ఆదేశం

By team teluguFirst Published Oct 17, 2022, 4:40 PM IST
Highlights

తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అశిష్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరుపై యూపీ ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని రెండు వారాల వరకు సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు యూపీ రాష్ట్రానికి సుప్రీంకోర్టు మంగళవారం మరో రెండు వారాల గడువు ఇచ్చింది. తనకు బెయిల్‌ను తిరస్కరిస్తూ జూలై 26న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థి కోసం బీజేపీ అభ్యర్థి ఉపసంహరణ... ఆంధేరి బైపోల్‌లో కీలక మలుపులు

ఈ మేరకు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 7, 2022 వరకు సమయం కేటాయించింది.  ఈ సందర్భంగా మిశ్రా తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో వాధిస్తూ.. పది నెలలపాటు నిందితుడు కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసినప్పటికీ, దానిని కోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు.

ఆర్టికల్ 370 ర‌ద్దు చేసినా.. కాశ్మీర్ లో హ‌త్య‌లు ఎందుకు ఆగ‌డం లేదు - షనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

బాధితుల తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ.. కనికరం లేకుండా నిందితుడు ఐదుగురిని చంపేశారని అన్నారు. రెండు న్యాయస్థానాలు ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని గుర్తించాయని చెప్పారు. కాగా.. అంతకు ముందు నిందితుడు మిశ్రా తన బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ.. తాను సాక్షులు లేదా సాక్ష్యాలను తొలగించేందుకు అవకాశం లేదని వాదించారు. ఎందుకంటే ప్రభుత్వం వారందరికీ భద్రత కల్పించిందని చెప్పారు.

ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరిని కాల్చిచంపిన మావోయిస్టులు

కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేస్తున్న సమయంలో లఖింపూర్ ఖేరీ ఘటన చోటు చేసుకుంది. 2021 అక్టోబర్ 3వ తేదీన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీలోని టికోనియాలో రైతుల బృందం నిరసన వ్యక్తం చేస్తుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కు చెందిన ఎస్ యూవీ రైతుల మీద నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ కారును అశిష్ మిశ్రానే డ్రైవ్ చేశార‌ని, కావాల‌నే రైతుల‌పై కారెక్కించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

ఆ రేప్ కేసులో నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలి.. కానీ, ఓ కండీషన్..: బాంబే హైకోర్టు తీర్పు

ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా క‌ల‌క‌లం సృష్టించింది. పెద్ద రాజకీయ దుమారమే చెల‌రేగింది. దీంతో లఖింపూర్ ఖేరి హింసాకాండను పర్యవేక్షించడానికి, దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తి రాకేష్ కుమార్ జైన్ ను నియమించింది. ఇదే కేసుపై ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌తో కూడిన సిట్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పునర్నిర్మించింది. కాగా.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో వాటిని కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది చివ‌రిలో ర‌ద్దు చేసింది. ఇదిలా ఉండగా.. లఖింపూర్ ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  అశిష్ మిశ్రాను గతేడాది అక్టోబరు 9న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. 
 

click me!