కర్ణాటక కాంగ్రెస్ అవినీతి వివ‌రాలు పంపిస్తా.. రాహుల్ గాంధీపై బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఫైర్

Published : Oct 17, 2022, 04:16 PM IST
కర్ణాటక కాంగ్రెస్ అవినీతి వివ‌రాలు పంపిస్తా.. రాహుల్ గాంధీపై  బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఫైర్

సారాంశం

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి వివరాలను రాహుల్ గాంధీకి పంపిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. బళ్లారిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో రాష్ట్రంలో 40 శాతం కమిషన్ పాలన కొన‌సాగుతున్న‌ద‌ని విమ‌ర్శించిన త‌ర్వాత బొమ్మై ఈ వ్యాఖ్య‌లు చేశారు.  

Karnataka CM Basavaraj Bommai: కర్ణాటక అసెంబ్లీకి ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలు ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు, వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ బీజేపీ-ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. పోటాపోటీ పాద‌యాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న భార‌త్ జోడో యాత్ర క‌ర్ణాట‌క‌లో ఉంది. ఈ యాత్ర‌లో భాగంగా బాల్లారిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం రాహుల్ గాంధీకి మ‌తిమ‌రుపు అంటూ ఘాటు వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించింది, 

కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి వివరాలను రాహుల్ గాంధీకి పంపిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. బళ్లారిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో రాష్ట్రంలో 40 శాతం కమిషన్ విచ్చలవిడి త‌నం కొన‌సాగుతున్న‌ద‌ని విమ‌ర్శించిన త‌ర్వాత బొమ్మై ఈ వ్యాఖ్య‌లు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అవినీతిపై వాస్తవాలు, గణాంకాలను రాహుల్ గాంధీకి పంపుతానని బొమ్మై అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ జరిపి కేసుల పత్రాలను పంపిస్తానని చెప్పారు.

భార‌త్ జోడో యాత్ర క్ర‌మంలో బళ్లారిలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన తర్వాత ఇది జరిగింది. కర్నాటకలో డబ్బున్న వారెవరైనా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చనీ, రాష్ట్రంలో 40 శాతం కమీషన్ పాల‌న కొన‌సాగుతున్న‌ద‌ని ఆరోపించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన బొమ్మై.. "డబ్బు ఉన్నవారు కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని రాహుల్ గాంధీ అన్నారు.. ఆయ‌న‌కు జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. కాంగ్రెస్ నేతలు ఆయనకు స‌రైన‌ సమాచారం ఇవ్వలేదంటూ" విమ‌ర్శించారు.  అలాగే, "కాంగ్రెస్ హయాంలో అవినీతి, ఉపాధ్యాయ నియామకాలు భారతదేశంలో మరెక్కడా జరగలేదు. అలాంటి స్కామ్‌ల వివరాలన్నింటినీ రాహుల్ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను అతనికి వాస్తవాలు, దానికి సంబంధించిన గణాంకాలను పంపుతున్నాను" అని బొమ్మై అన్నారు.

ఇదిలావుండ‌గా, కర్ణాటక ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ట్విటర్‌లో రాష్ట్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు.  ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన ఆయ‌న‌.. “అభినందనలు @CMofKarnataka మేము ఇప్పుడు జాతీయ పత్రికల మొదటి పేజీలో కూడా ఉన్నాము. #40PercentSarkara పరిపాలనా ఉదాసీనత & అవినీతి బెంగళూరు వ్యాపార, ఉపాధికి గమ్యస్థానంగా లేదని నిర్ధారిస్తుంది" అని పేర్కొన్నారు.

 

అలాగే, బెంగ‌ళూరులో ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌, ప్ర‌ణాళిక‌లు లేకుండా ముండుకు సాగ‌డం,  నాసిరకం మౌలిక సదుపాయాలు, ప్రబలమైన అవినీతి గురించిన ఓ ప‌త్రిక క‌థ‌నాన్ని” పంచుకున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌