Narendra Modi: ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపం.. కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చిన మహిళ‌

By Mahesh Rajamoni  |  First Published Nov 15, 2023, 10:41 PM IST

PM Modi: గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాని బుధవారం ఆయనకు నివాళులు అర్పించారు. అయితే, జార్ఖండ్ లో ఊహించని విధంగా ఒక్క‌సారిగా మహిళ పీఎం కాన్వాయ్ ముందుకు రావడంతో ప్రధాని వాహనాన్ని క్షణికావేశంలో నిలిపివేయాల్సి వచ్చింది.
 


 PM Modi's Security Breached: ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం ఘటన వెలుగులోకి వచ్చింది. బిర్సా ముండా జయంతి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఓ మహిళ అకస్మాత్తుగా ప్రధాని వాహనం ముందుకు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చింది. అయితే, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భద్రతా సిబ్బంది ఆ మహిళను పట్టుకొని ప్రధాని కాన్వాయ్ ముందు నుంచి ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఊహించని విధంగా కొన్ని క్ష‌ణాల్లో ఒక్క‌సారిగా మహిళ కాన్వాయ్ ముందుకు రావడంతో ప్రధాని వాహనాన్ని క్షణికావేశంలో నిలిపివేయాల్సి వచ్చింది. ఆమెను ప‌క్క‌కు తీసుకెళ్లిన కొద్ది సెకన్ల తర్వాత ప్రధాని మోడీ కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లింది.

 

PM मोदी की सुरक्षा में बड़ी चूक! राँची में प्रधानमंत्री की गाड़ी के सामने आ पहुँची महिला, अचानक रोकना पड़ा काफिला. pic.twitter.com/Rcj2QVm4mn

— Utkarsh Singh (@UtkarshSingh_)

Latest Videos

undefined

అసలేం జరిగిందంటే..?

బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ భవన్ నుంచి రాంచీలోని బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కు వెళ్తుండగా రేడియం రోడ్డులో భ‌ద్ర‌త‌కు సంబంధించిన లోపం చోటుచేసుకుంది. కాన్వాయ్ ముందు ఊహించని విధంగా ఓ మహిళ కనిపించడంతో డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు యాక్టివేట్ చేశాడు. వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ప్రధానికి రక్షణ కల్పించగా, క్షణాల్లోనే అక్కడున్న భద్రతా సిబ్బంది ఆ మహిళను ప‌ట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అకస్మాత్తుగా మహిళ వాహనం ముందుకు రావ‌డంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఎన్ఎస్ జీ గార్డులు, ఇతర భద్రతా సిబ్బంది.. ఆ మహిళను రోడ్డు పక్కనకు తరలించడంతో ప్రధాని కాన్వాయ్ త‌ర్వాత ముందుకు సాగింది.

click me!