ఆత్మహత్య చేసుకుంటానని బ్రిడ్జీ ఎక్కిన వ్యక్తి.. బిర్యానీ తినిపిస్తామన్న పోలీసుల హామీతో కిందికి..

By Mahesh K  |  First Published Jan 23, 2024, 5:47 PM IST

కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి భావోద్వేగ, ఆర్థిక సమస్యలతో సతమతమై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కోల్‌కతా బ్రిడ్జీ ఎక్కి దూకేస్తానని బెదిరించాడు. పోలీసులు స్పాట్‌కు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. కిందికి వస్తే బిర్యానీ కొనిపెడతామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కిందికి దిగాడు.
 


Kolkata: పశ్చిమ బెంగాల్‌లో 40 ఏళ్ల ఓ వయోజనుడు ఆత్మహత్య  చేసుకోవాలని అనుకున్నాడు. తనతో పాటే వచ్చిన కూతురిని అక్కడే ఉంచి ఆయన సూసైడ్ చేసుకోవడానికి బ్రిడ్జీ ఎక్కాడు. ఎంతకీ కిందికి రాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కిందికి వస్తే బిర్యానీ తినిపిస్తామని, ఉద్యోగం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి కిందికి దిగి వచ్చాడు. ఈ ఘటన కోల్‌కతాలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చాలా రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరగడంతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని కరయా స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

అనంతరం, ఆ వ్యక్తిని గుర్తించారు. 40 ఏళ్ల ఆ వ్యక్తి కోల్‌కతా నగరానికి చెందినవాడే. అయితే, ఇటీవలే ఆయన భార్య దూరమైంది. అదే సమయంలో వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు వచ్చి ఆర్థికంగా చితికిపోయాడు. ఇవన్నీ వెరసి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

Latest Videos

undefined

‘సుమారుగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి తన బిడ్డను బైక్ సైన్స్ సిటీకి తీసుకెళ్లడానికి బయల్దేరాడు. మార్గం మధ్యలో సడెన్‌గా ఆగాడు. తన మొబైల్ ఫోన్ ఇక్కడే ఎక్కడో కిందపడిపోయిందని చెప్పి బిడ్డను అక్కడే నిలబెట్టి వెతికినట్టుగా నటించాడు. ఆ తర్వాత ఆయన బ్రిడ్జీ ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేస్తానని బెదిరించాడు’ అని ఓ పోలీసు అధికారి వివరించారు. 

Also Read : Barrelakka: ఇలాంటి పనులు చేయకు.. వారితో స్నేహమంటే పాములతో స్నేహమే.. బర్రెలక్కపై ట్రోల్స్

వెంటనే స్థానిక పోలీసులు, కోల్‌కతా పోలీసు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది స్పాట్‌కు వచ్చారు. ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

‘అక్కడే ఉన్న అతని కూతురితో మాట్లాడం. ఆయన సమస్యను అర్థం చేసుకున్నాం. అందుకు అనుగుణంగానే సంభాషణ ప్రారంభించాం. చివరకు ఆయనను కన్విన్స్ చేయడానికి కొన్ని ఆఫర్లు ఇచ్చాం. ఆయన దిగి వచ్చాడు’ అని ఆ అధికారి వివరించారు.

click me!