ప్రమాదానికి గురై చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తి కడుపులో కత్తిని గుర్తించి షాక్‌కు గురైన ఘటన గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో చోటుచేసుకుంది.
గుజరాత్ : వైద్యు నిర్లక్ష్యం రోగుల ప్రాణాలు మీదికి తెచ్చిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఆపరేషన్లు చేసిన తర్వాత కడుపులో కత్తులు, కత్తెర్లు, దూది లాంటివి మరిచిపోవడం కనిపిస్తుంది. అయితే, కత్తిపోట్లకు గురైన వ్యక్తిని సరిగా పరీక్షించకపోవడంతో ఓ యువకుడు నరకం అనుభవించిన ఘటన ఒకటి గుజరాత్ లో వెలుగు చూసింది. ఓ వైద్యుడు నిర్లక్ష్యంతో ఓ యువకుడి కడుపులో కత్తి ఐదేళ్లుగా అలాగే ఉండిపోయింది.
విపరీతమైన కడుపునొప్పితో అనేక రకాల ఆస్పత్రులు తిరిగిన అసలు విషయం వెలుగు చూడలేదు. కడుపునొప్పి భరించలేక ఆ యువకుడు నరకం అనుభవించాడు. ఈ ఘటన గుజరాత్ లోని భరుచ్ జిల్లా అంకాలేశ్వర్ లో వెలుగు చూసింది. ఇక్కడ స్థానికంగా ఉండే అతుల్ గిరి అనే యువకుడు ఐదేళ్ల క్రితం కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా… భరూచ్ సివిల్ ఆస్పత్రిలో వైద్యులు అతడిని సరిగా పరీక్షించకుండానే టాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అతనికి కడుపునొప్పి మొదలయ్యింది.
undefined
AP train accident: తొమ్మిదికి చేరిన మరణాలు.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం
ఎన్నిసార్లు ఎన్ని రకాల ఆస్పత్రులు తిరిగినా ఎన్ని మందులు వాడినా అతని కడుపునొప్పి తగ్గలేదు. కడుపు నొప్పితో నరకం చూసేవాడు. ఇటీవల మరోసారి అతుల్ ప్రమాదానికి గురైయ్యాడు. కుటుంబ సభ్యులు అతనికి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ వైద్యులకి తనకి గత ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పి ఉందని అతుల్ తెలిపాడు. దీంతో ఎక్స్ రే తీసిన డాక్టర్లు షాక్ అయ్యారు. అతుల్ కడుపులో కత్తి ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి కత్తిని బయటికి తీస్తామని.. వైద్యులు చెప్పారు