గుజరాత్‌లో 28 ఏళ్ల యువకుడు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలిలో ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో తన ఆత్మహత్యకు అత్తా, మామ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమాలు కారణం అని పేర్కొన్నాడు.
గాంధీనగర్: గుజరాత్‌లో ఓ 28 ఏళ్ల యువకుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. ఉరి తాడుకు వేలాడుతున్న స్థలంలోనే ఓ సూసైడ్ నోట్ కనిపించింది. ఆ సూసైడ్ నోట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు సహా ఆయన అత్తా, మామల పేర్లు కనిపించాయి. ఆ సూసైడ్ నోట్‌ను కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని జునాగడ్‌లోని చోర్వాడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
మృతుడిని నితిన్ పర్మార్‌గా గుర్తించారు. శనివారం, ఆదివారం మధ్య రాత్రిలో నితిన్ పర్మార్ ఉరి వేసుకున్నట్టు పోలీసు ఇన్‌స్పెక్టర్ కేఎం గాధ్వి తెలిపారు. ‘ప్రాథమికంగా ఇదొక సూసైడ్ కేసు అని భావిస్తున్నాం. అయితే, మరణానికి గల కచ్చితమైన కారణం పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలనుంది. సూసైడ్ నోట్‌పై ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది’ అని వివరించారు.
undefined
ఘటనా స్థలిలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారని, ఆ సూసైడ్ నోట్‌లో నితిన్ పర్మార్ అత్తా మామ, కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమాలను పేర్కొన్నాడని వివరించారు. ఈ ముగ్గురి వల్లే నితిన్ పర్మార్ సూసైడ్ చేసుకున్నట్టు అందులో రాసినట్టు తెలిపారు.
Also Read: ‘మరాఠా కోటా ప్రకటించేదాకా రాజకీయ నాయకుడు మా గ్రామంలోకి రావొద్దు’
కాగా, దీనిపై ఎమ్మెల్యే చూడాసమా స్పందించారు. ‘నితిన్ పర్మార్ నాకు బంధువే. కానీ, ఆయన నన్ను కలువక రెండేళ్లు అవుతున్నది. ఆయన బాడీపై గాయాలు చూసి ఆయన కుటుంబం ఇది హత్య అనే అనుకుంటున్నది. ఆ సూసైడ్ నోట్ నాపై జరిగిన కుట్ర అని అనుకుంటున్నాను. అది ఆయన హ్యాండ్ రైటింగ్ కాదు. ఇది నాపై నా ప్రత్యర్థుల కుట్రే’ అని ఆరోపించారు.