కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ కార్యాలయాన్ని మూసివేశారు. రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ కార్యాలయాన్ని మూసివేశారు. రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. ఈ విషయం తెలియడంతో ఈ కార్యాలయాన్ని ఇవాళ, రేపు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.రామ్ విలాస్ పాశ్వాన్ పరిధిలో రెండు విభాగాలు ఉన్నాయి. ఆహారం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల ఎఫైర్స్ శాఖలు ఉన్నాయి.
also read:వ్యాపారులకు యోగి సర్కార్ గుడ్ న్యూస్: షాపుల ఓపెన్‌కు అనుమతి, గైడ్‌లైన్స్ ఇవీ...
మత్స్యశాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకిందని తేలింది. ఈ భవనం న్యూఢిల్లీలోని రాజ్ పత్ ఏరియాలో గల కృషి భవన్ లో ఉంది. ఇక్కడే పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఉన్నాయి.
న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనంలో ఏప్రిల్ 28వ తేదీన ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ కార్యాలయాన్ని మూసివేశారు. మే 5వ తేదీన న్యాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ కార్యాలయాన్ని కూడ మూసివేశారు.
తాజాగా రామ్ విలాస్ పాశ్వాన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా రావడంతో శానిటైజేషన్ చేసేందుకు వీలుగా రెండు రోజుల పాటు ఈ కార్యాలయాన్ని మూసివేశారు.