హిమాచల్‌లో విరిగిపడిన కొండచరియలు: 13 మృతదేహల వెలికితీత, శిథిలాల కిందే 60 మంది

By narsimha lodeFirst Published Aug 12, 2021, 9:39 AM IST
Highlights

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో  13 మృతదేహాలను వెలికితీశారు.శిథిలాల కింద 60 మంది చిక్కుకొన్నారని సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు.గురువారం నాడు ఉదయం నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో  ఇప్పటివరకు 13 మంది మృతదేహలను  వెలికితీశారు. కొండచరియల కింద  ఉన్న వాహనాల్లో ఇంకా 60 మంది చిక్కుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకొన్న వారిని  రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు  కొనసాగిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ ప్రాంతంలో బుధవారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది.కిన్నౌర్‌లోని రెకాంగ్ పియో-సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియల కింద రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సు,  ట్రక్‌తో పాటు కొన్ని వాహనాలు చిక్కుకొన్నాయి.ఈ ప్రమాదంలో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ మహింర్ పాల్, కండక్టర్ గులాబ్ సింగ్ సహా 13 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

also read:హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు: చిక్కుకొన్న పలు వాహనాలు, ఒకరి మృతి

శిథిలాల కింద 60 మంది చిక్కుకొన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ చెప్పారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో సహాయక చర్యలను ప్రారంభించినట్టుగా ఐటీబీపీ పోలీసులు చెప్పారు.

ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, హోంగార్డు సభ్యులు సంయుక్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న టాటా సుమో వాహనంలో  ఎనిమిది మంది డెడ్‌బాడీలను గుర్తించారు.  ఈ  ఘటనలో మరో ట్రక్కు డ్రైవర్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. శిథిలాల కింద ఓ కారును వెలికితీశారు. అయితే కారు లోపల ఎవరూ కన్పించలేదని  రెస్క్యూ సిబ్బంది చెప్పారు.

ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం అన్ని రకాలుగా ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని  ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.గాయపడినవారికి రూ. 50 వేలు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

click me!