జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విఫలం..!

Published : Aug 12, 2021, 07:25 AM ISTUpdated : Aug 12, 2021, 07:51 AM IST
జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విఫలం..!

సారాంశం

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 

జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విఫలం కావడం గమనార్హం. జీఎస్ఎల్ వీ-ఎఫ్10 వాహక నౌక ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. అది క్రయోజనిక్ దశలో విఫలమైంది. మూడో దశలో రాకెట్ లో సమస్య తలెత్తింది. దీంతో వాహక నౌక ప్రయోగించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది.

మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ వాహన నౌక కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 26గంటలపాటు నిరంతరాయంగా కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి వెళ్లింది.

భూ పరిశీలన కోసం దీనిని ప్రయోగించారు. నీటి వనరులు, పంటలు, అడవులు, హిమానీనదాలు, సరిహద్దుల్లో అంచనా తదితరాల గురించి ఇది నిరంతర సమాచారం అందించడానికి వీలుగా పంపించారు. కానీ.. అది గతి తప్పడంతో.. అందరూ నిరాశకు గురౌతున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu