డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ పూర్తయ్యిందంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్

Published : Aug 12, 2021, 09:12 AM ISTUpdated : Aug 12, 2021, 09:16 AM IST
డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ పూర్తయ్యిందంటూ  ప్రకాశ్ రాజ్ ట్వీట్

సారాంశం

తన మిత్రుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేసినట్లు చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తాను మళ్లీ తిరిగి నటిస్తానంటూ ప్రకటించారు.  

ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కి సర్జరీ పూర్తయ్యింది. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు శస్త్ర చికిత్స పూర్తయ్యిందంటూ ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్ గురువారెడ్డి ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగినట్లు పేర్కొన్నారు.

డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ పూర్తయ్యిందంటూ ట్వీట్ చేశారు. తన మిత్రుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేసినట్లు చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తాను మళ్లీ తిరిగి నటిస్తానంటూ ప్రకటించారు.

కాగా.. తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. మరోవైపు మా ఎన్నికల్లోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. చేతికి గాయం కావడంతో...  మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 

అలాగే ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport