నన్ను వదిలి వెళ్లిపోతానంది.. అందుకే శ్రద్ధను చంపేశా : అఫ్తాబ్ వాంగ్మూలంలో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published Dec 2, 2022, 5:42 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అప్తాబ్‌కు పాలిగ్రాఫ్, నార్కో టెస్టులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతను కీలక విషయాలు వెల్లడించాడు. 

ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి నిందితుడి నార్కోటెక్స్ టెస్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధా తనకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతానని చెప్పిందని, తనను విడిచి మరొకరితో వెళ్లిపోతుందేమోనన్న కోపంతోనే చంపేశానని అన్నాడు నిందితుడు అఫ్తాబ్. శ్రద్ధను 35 ముక్కలుగా నరికేశానని ఒప్పుకున్నాడు. పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పిన సమాధానాలే , నార్కో పరీక్షలోనూ చెప్పాడని పోలీసులు తెలిపారు. 

ఇకపోతే... శ్రద్ధా వాకర్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. బుధవారం జరిగిన పాలిగ్రాఫ్ పరీక్షలో శ్రద్ధాను హత్య చేసింది తానేనని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా.. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో టెస్టు గురువారం ఢిల్లీలోని రోహిణిలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఆసుపత్రిలో జరిగింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 1 గంట 50 నిమిషాల పాటు కొనసాగింది. పరీక్షల అనంతరం నిందితుడు అఫ్తాబ్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ పరీక్షలో కూడా తాను శద్ద్రాను  శ్రద్ధను చంపినట్లు మరోసారి అంగీకరించాడు.

ALso REad:శ్రద్ధా హత్య కేసులో కీలక పురోగతి.. నార్కో పరీక్ష పూర్తి.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు అఫ్తాబ్ పరీక్షలో అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు ఆంగ్లంలో సమాధానాలు చెప్పారు. అదే సమయంలో అఫ్తాబ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం తీసుకున్నాడు. కానీ ప్రశ్నలు పదే పదే పునరావృతం చేయడంతో అతను సమాధానం చెప్పాడు. పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని తెలుస్తుంది. 

హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు

నార్కో పరీక్షలో శ్రద్ధను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ అంగీకరించాడు. అంతే కాదు.. శ్రద్ధా శరీరాన్ని ముక్కలు చేయడానికి ఏ ఆయుధాలు ఉపయోగించాడో, వాటిని ఎక్కడ విసిరాడో కూడా అఫ్తాబ్ చెప్పాడంట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరీక్ష సమయంలో అఫ్తాబ్.. పలుమార్లు తెలివిగా వ్యవహరించడాన్ని తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసుల మాటకు కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తున్నానని కోర్టు తెలియజేశాడు. అతడు పాలిగ్రాఫ్ ,నార్కో పరీక్షలకు కూడా అంగీకరించారు. కానీ, అతని ప్రవర్తనపై ఇప్పటికి  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

click me!