స్వంత పార్టీలోనే ఖర్గేకు నిరసన సెగ.. జాగ్రత్తగా మాట్లాడాలని హితవు.. 

By Rajesh KarampooriFirst Published Dec 2, 2022, 5:00 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన “రావణ్” వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్వంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ.. సొంత పార్టీ నేతలే విమర్శించారు. 

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన “రావణ్” వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. మరింత ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేలా ఉంది. ఈ తరుణంలో ఊహించని విధంగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు స్వంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ.. సొంత పార్టీ నేతలే విమర్శించారు. నాయకులు మాట్లాడేటప్పుడు పదాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలని  కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ సూచించారు. అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండటం మంచిదనీ, మాట్లాడేటప్పుడూ జాగ్రతగా వ్యవహరించాలని సూచించారు. ముంతాజ్ పటేల్ .. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కుమార్తె.

ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీని రావణుడిగా అభివర్ణించారు. ఖర్గే ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ముంతాజ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ..ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మన నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చాలా పదాలు దుర్వినియోగం చేయబడతాయి. మాట్లాడేటప్పడూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ సలహా ఒక్క కాంగ్రెస్‌కే కాదని అన్నారు. దీన్ని అన్ని పార్టీలు, నాయకులు ఆలోచించాలని అన్నారు. 

 రావణుడి లాగా ప్రధానికి 100 తలలు ఉన్నాయా?: ఖర్గే

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో (అక్టోబర్ 28న ) కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నిక‌లైనా మోదీ ముఖం క‌నిపిస్తోంది. రావ‌ణుడిలా ప్రధాని మోడీకి వంద‌ త‌ల‌లున్నాయా అని ప్ర‌శ్నించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు, అసెంబ్లీ ఎన్నిక‌లు అస‌లు ఎన్నిక‌లేవైనా మోదీకి ఓట్లు వేయమని అడుగుతున్నార‌ని, అభ్య‌ర్ధి పేరుతో ఓట్లు అడ‌గండ‌ని నాయకులకు హిత‌వు ప‌లికారు.   

మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై విపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రామసేతును కూడా ద్వేషిస్తోందన్నారు. ప్రధాని పదవిని దిగజార్చేందుకు, దుర్వినియోగం చేసేందుకు కాంగ్రెస్‌లో పోటీ నడుస్తోందనీ, తనని దుర్భాషలాడేందుకు రామాయణం నుంచి రావణుడిని తీసుకొచ్చారనీ, అసలూ కాంగ్రెస్ వాళ్లు రాముడి ఉనికిని నమ్మరని, అలాంటి వారు.. రావణుడిని గురించి మాట్లాడం ఆశ్చర్యంగా ఉండని ప్రధాని మోడీ అన్నారు. 

ముంతాజ్ పటేల్ ఎవరు? 

ముంతాజ్ పటేల్ కాంగ్రెస్ నాయకురాలు. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సలహాదారు అయిన అహ్మద్ పటేల్ కుమార్తె. అహ్మద్ రెండేళ్ల క్రితం కోవిడ్‌తో చనిపోయాడు. ఇప్పుడు అహ్మద్ రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమార్తె ముంతాజ్ నిర్వహిస్తోంది. అహ్మద్ పటేల్ 2001 నుంచి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ఉన్నారు. ఆయన  1986లో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. 1977 నుంచి 1982 వరకు యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అతను సెప్టెంబర్ 1983 నుండి డిసెంబర్ 1984 వరకు కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కోశాధికారిగా నియమితులయ్యారు. అనేక పదవులను స్వీకరించారు. 
 

click me!