ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధి

Published : Jul 31, 2020, 01:49 PM ISTUpdated : Jul 31, 2020, 02:03 PM IST
ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధి

సారాంశం

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో రెగ్యులర్ చెక్ అప్స్ నిమిత్తం ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 

ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఆ ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసాయి. మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులతో ఆమె వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా అందరితో చర్చించారు.  కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కడుపు నొప్పి కారణంగా సోనియా అడ్మిట్ అయిన విషయం విదితమే!

ఇకపోతే.... రాజస్థాన్ లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ చేసిన వినతిని మూడోసారి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తిరస్కరించారు. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ విషయంలో కల్ రాజ్ మిశ్రా గెహ్లాట్ వినతిని గవర్నర్ తిరస్కరించారు. బుధవారం నాడు మూడోసారి కూడ తోసిపుచ్చారు.

ఈ నెల 31వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ ను కోరుతూ కేబినెట్ సిఫారసు చేసింది. అయితే సిఫారసును ఆయన తిరస్కరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై 21 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని గవర్నర్ రెండు రోజుల క్రితం సీఎం రాసిన లేఖకు సమాధానంగా లేఖ పంపారు. 

అసెంబ్లీ సమావేశాల్లో భౌతిక దూరం ఎలా పాటిస్తారని కూడ ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. గవర్నర్ లేఖ పంపిన తర్వాత మూడోసారి కూడ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయమై గెహ్లాట్ రాసిన లేఖపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొనేందుకు ఆశోక్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతున్నారు. సచిన్ పైలెట్ వర్గం వైపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆలస్యమైతే మరికొందరు ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉందని భావిస్తున్న గెహ్లాట్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families