
Parliament security breach : లోక్ సభలో భారీ భద్రతా ఉల్లంఘన జరింది. ఇద్దరు అగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలో ప్రవేశించారు. వీరిద్దరూ సభలోకి చొరబడటంతో అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దుండగుల చేతిలో స్మోక్ డబ్బాలు ఉండటంతో ఎంపీలందరూ భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. దీంతో స్పీకర్ వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఈ దుండగుల్లోని ఒకరు లోక్ సభలోని బెంచీలపైకి దూసుకెళ్లగా, మరొకరు పబ్లిక్ గ్యాలరీ నుంచి ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ.. స్మోక్ గ్యాస్ రిలీజ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఆకస్మిక చర్యతో అక్కడున్న ఎంపీలు, భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. దుండగులను పట్టుకొని అలెర్ట్ అయ్యారు. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వారెవరూ ? అసలెందకు ఇలా చేశారనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది.
ఆ పొగ హానికరమైనది కాదు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
కాగా.. ఈ ఘటన వెనక ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఉన్నారేమో అని అనుమానం సర్వత్రా రేకెత్తుతోంది. ఎందుకంటే అతడు కొన్ని రోజుల కిందట ఓ వీడియో విడుదల చేశారు. అందులో డిసెంబర్ 13 న లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని ప్రకటించాడు. భారత అధికారులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, అందుకే తాను ఈ చర్యకు పాల్పడబోతున్నాని చెప్పారు. 2001 పార్లమెంటుపై దాడి కేసులో 2013లో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు ఫొటోతో ఓ పోస్టర్ తయారు చేసి ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అనే శీర్షికతో ఈ వీడియోను రిలీజ్ చేశాడు.
నేనే గ్యాస్ డబ్బాలు పట్టుకున్నా - లోక్ సభలో దాడిపై కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అలెర్ట్ అయ్యాయి. పార్లమెంట్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ అందరి కళ్లుగప్పి ఇద్దరు వ్యక్తులు స్మోక్ గ్యాస్ ను లోపలికి తీసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ఘటన వెనక పన్నూన్ ఉన్నాడా ? లేక అతడికి ఈ దాడికి సంబంధం లేదా ? అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా.. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటుపై దాడి జరిగింది. ఆ దాడిలో అమరులైన భద్రతా సిబ్బందికి దేశం నివాళులు అర్పించిన రోజే భద్రతా ఉల్లంఘన జరగడం శోఛనీయం.