ఖలిస్తానీ ఉగ్రవాది, గ్యాంగ్ స్టర్ హర్విందర్ సింగ్ రిండా మృతి.. ఎలాగంటే ?

By team teluguFirst Published Nov 20, 2022, 12:52 PM IST
Highlights

పలు రాష్ట్రాల్లో అనేక నేరాల్లో, తీవ్రవాద చర్యల్లో ప్రమేయం ఉన్న గ్యాంగ్ స్టర్, ఖలిస్థానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా చనిపోయాడు. మూత్రపిండాల వ్యాధితో హాస్పిటల్ చేరిన అతడు పరిస్థితి విషమించి శనివారం మరణించాడు. 

పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌, ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ శనివారం మృతి చెందారు. మూత్రపిండాల సమస్య కారణంగా అతడు గత సోమవారం లాహోర్‌లోని ఆసుపత్రిలో చేరాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రిండా పంజాబ్‌లో కనీసం 10 ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉంది. ఈ ఏడాది మేలో పంజాబ్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంపై జరిగిన ఆర్పీజీ దాడిలో కూడా అతడి ప్రమేయం ఉంది. రిండా మృతి వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉండవచ్చని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.

కన్నతండ్రి కడతేర్చిన కొడుకు.. తల్లి సహయంతో తండ్రి శవాన్ని రంపంతో కోసి..

అతడికి పంజాబ్‌లో చాలా లింకులు ఉన్నాయి. అందువల్ల అతడు పాకిస్తాన్‌ల ఉండే ఉగ్రవాద నాయకులకు చాలా దగ్గరయ్యాడు. ఖలిస్తాన్ అనుకూల బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాద సంస్థకు చెందిన రిండా, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) పంజాబ్‌లోకి డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించిందని పంజాబ్ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారని ‘హిందుస్థాన్’ నివేదించింది. 

అతడి మృతిపై రాష్ట్ర పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘రిండా మరణం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, కేంద్ర ఏజెన్సీల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతడు హెరాయిన్ కు బానిసయ్యాడని, దాని వల్లే హాస్పిటల్ చేరాడని తెలుస్తోంది. రిండా మరణం పంజాబ్‌కు పెద్ద ఉపశమనం.’’ అని పేర్కొన్నారు. రిండా మృతిలో ఐఎస్‌ఐ హస్తాన్ని తోసిపుచ్చలేమని ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘‘రిండా శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలి కాలంలో బీకేఐ చీఫ్ వాడవ సింగ్ బబ్బర్‌తో అతడికి తత్సంబంధాలు లేవు. కాబట్టి అతడి మరణం వెనుక కూడా ఐఎస్ఐ హస్తం ఉండొచ్చు ’’అని పేర్కొన్నారు.

సోమ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ

అమృత్‌సర్‌లోని తరణ్ జిల్లాకు చెందిన రిండా, కుటుంబ కలహాల తర్వాత 2008లో మొదటిసారిగా అరెస్టయ్యారని తెలిపారు. జైలులో ఉన్న సమయంలో నేరస్థులతో పరిచయం ఏర్పడిన తర్వాత రిండా మహారాష్ట్రలోని నాందేడ్‌లో తన స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు. అతడు 2020లో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులతో పరిచయం ఏర్పడిన తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి పాకిస్తాన్‌కు వెళ్లాడని మరో ఇంటిలిజెన్స్ అధికారి చెప్పారని ‘హిందుస్థాన్’ నివేదించింది.

ఉగ్రవాద చర్య వల్లే మంగళూరు ఆటో పేలుడు - కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్

హర్విందర్ సింగ్ రిండా గతంలో పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, హర్యానాలో హత్యలు, కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, స్నాచింగ్‌లతో పాటు 24 భయంకరమైన నేరాల్లో ప్రమేయం ఉందని పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. ఫరీద్‌కోట్ హత్యలో అతడి పాత్ర బయటపడిన కొద్ది రోజులకే రిండా మరణించాడు. కాగా.. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో డేరా సచ్చా సౌదా శిష్యుడు ప్రదీప్ సింగ్ కటారియాను పట్టపగలు ఆరుగురు నేరగాళ్లు కాల్చిచంపారు. 

click me!