కన్నతండ్రిని కడతేర్చిన కొడుకు.. తల్లి సహయంతో తండ్రి శవాన్ని రంపంతో కోసి.. 

Published : Nov 20, 2022, 11:41 AM ISTUpdated : Nov 20, 2022, 11:42 AM IST
కన్నతండ్రిని కడతేర్చిన కొడుకు.. తల్లి సహయంతో తండ్రి శవాన్ని రంపంతో కోసి.. 

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని బరుయ్‌పూర్ ప్రాంతంలో కన్న తండ్రి హత్య చేసి.. శవాన్ని తన తల్లి సహాయంతో చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన విషయం ఎవరికి తెలియకూడదని హంతకులే వెళ్లి .. బాధితుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లోతుగా విచారించగా.. కొడుకు తన తల్లితో కలిసి తండ్రిని హత్య చేసి మృతదేహాన్ని రంపంతో ఐదు ముక్కలుగా నరికి పారేసినట్లు తేలింది.

సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పొరుగు సంబంధాలతో కలిసి మెలసి మాట పక్క పెట్టితే.. అయినా వారే.. ఒకే ఇంట్లో ఉంటే ..  రక్త సంబంధాలే శత్రువులుగా మారుతున్నారు. రక్త బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. తేడా వస్తే.. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేంతటి దారుణమైన ఘోరానికి పాల్పడుతున్నారు.

తాజాగా..  పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని బరుయ్‌పూర్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ నావికాదళ అధికారి కుళ్ళిపోయిన మృతదేహం లభ్యమైంది. అంతకుముందే అతడు తప్పిపోయాడని ఆ నావికాదళ అధికారి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిమగ్నమయ్యారు.  

నావికాదళ అధికారి  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు విస్తుకొలిపే వాస్తవాలు తెలిశాయి.  ఆ రిటైర్డ్ అధికారిని చంపింది కన్న కొడుకేననీ, ఆ హత్యకు క్రుట పన్నింది తన భార్యనేనని తెలిసిందే. అంతేకాకుండా హత్య శవాన్ని రంపంతో కోసి ముక్కలు చేశారు. ఆ ముక్కులను తల్లి కొడుకులు పలు చోట్ల పారేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19న చెరువులో కుళ్లిపోయిన నావికాదళ మాజీ అధికారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఉజ్వల్ చక్రవర్తిగా గుర్తించారు. అతని వయస్సు దాదాపు 55 సంవత్సరాలు. అతను భారత నావికాదళ మాజీ నాన్-కమిషన్డ్ ఆఫీసర్. అతను 2000లో పదవీ విరమణ చేశాడు. మృతదేహం ప్లాస్టిక్‌లో చుట్టి కనిపించింది. 
అంతకంటే ముందే మృతుడి కుటుంబ సభ్యులు ఈనెల 15న అతడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 14న అతని ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో తండ్రిపై  కొడుకు దాడి చేశాడు. ఈ సమయంలో తండ్రి  మరణించాడు.

దీని తర్వాత.. తల్లి,కొడుకులు మృతదేహాన్ని ఐదు ముక్కలు చేసి.. వాటన్నింటినీ అడవి ప్రాంతంలో  పారేశారు. కానీ ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచిపెట్టి.. పైగా అతడు మద్యానికి బానిసైనట్లు, గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహంలోని కొన్ని భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కొన్ని భాగాల కోసం వెతుకుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu
స్పీచ్ అదరగొట్టిన తలపతి | Thalapathy Vijay Swearing-in Ceremony | Asianet News Telugu