ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Khalistan terrorist Gurpatwant Singh Pannoon)పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పై హత్యా బెదిరింపులకు (Punjab CM Bhagwant Mann received death threats) పాల్పడ్డాడు. ఆయనపై రిపబ్లిక్ డే రోజు (Republic Day)దాడి చేస్తానని హెచ్చరించాడు. అలాగే పంజాబ్ డీజీపీకి (Punjab DGB)కూడా హెచ్చరికలు జారీ చేశాడు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. సీఎంను రిపబ్లిక్ డే రోజు హతమారుస్తామని హెచ్చరించాడు. ఆయనతో పాటు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ను కూాడా చంపేస్తానని పన్నూన్ బెదిరించాడు. గ్యాంగ్ స్టర్లు ఏకమై జనవరి 26న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రిపై దాడి చేయాలని అతడు పిలుపునిచ్చారు.
అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..
undefined
పంజాబ్ ప్రభుత్వం కొంత కాలం నుంచి గ్యాంగ్ స్టర్ లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎంకు పన్నూన్ నుంచి ఈ బెదింరుపులు వచ్చాయి. సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడైన పన్నూన్.. గతంలో భారత సంస్థలు, అధికారులపై హత్యా బెదిరింపులు చేశాడు.
కొంత కాలం కింద పార్లమెంట్ పై కూడా దాడి చేస్తానని హెచ్చరించాడు. డిసెంబర్ 13న లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని హెచ్చరిస్తూ వీడియో విడుదల చేశాడు. నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా ద్వారా ప్రయాణించాలనుకునే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయనపై కేసు నమోదు చేసింది.
వావ్.. మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కలెక్టర్.. వీడియో వైరల్..
ఈ నెల మొదటి వారంలో కూడా అతడు ముస్లింలకు పలు సూచలను చేశాడు. రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో విమానాశ్రయాలను మూసివేయడానికి తనకు ముస్లింలు సహాయం చేయాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కోరారు. ముస్లింలు భారత్ నుంచి 'ఉర్దిస్తాన్' దేశాన్ని విడదీయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. లేకపోతే మోడీ నేతృత్వంలోని హిందూ ప్రభుత్వం ప్రతీ ముస్లింను బలవంతంగా మతమార్పిడి చేస్తుందని హెచ్చరించారు.
కవితకు ఈడీ నోటీసులు: తెలంగాణలో రాజకీయ చర్చ, ఎందుకంటే?
ఖలిస్తాన్ అనే స్వతంత్ర సిక్కు మాతృభూమిని భారతదేశం నుండి విడదీయాలని ప్రచారం చేస్తున్న సిక్కు ఫర్ జస్టిస్ ను 2019 లో ప్రభుత్వం చట్టవ్యతిరేక సంఘంగా గుర్తిస్తూ, ఆ సంస్థను నిషేదించింది. ఆ సంస్థ చీఫ్ గా ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ను 2020లో ఉగ్రవాదగా ప్రకటించింది. కాగా.. అమెరికా గడ్డపై పన్నూన్ ను హతమార్చేందుకు కుట్ర పన్నిన కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై గత ఏడాది నవంబర్ లో అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. హత్య చేయడానికి ఒక హంతకుడికి 100,000 డాలర్లు చెల్లించడానికి గుప్తా అంగీకరించాడని, అదే సంవత్సరం జూన్ లో ఇప్పటికే 15,000 డాలర్లు అడ్వాన్స్ గా చెల్లించారని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు చెక్ రిపబ్లిక్ లో గుప్తాను అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం అక్కడి కోర్టులో కొనసాగుతోంది.