కర్ణాటక ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది.. ఎందుకంటే ?

Published : Apr 12, 2023, 01:25 PM IST
కర్ణాటక ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది.. ఎందుకంటే ?

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఆ పార్టీని వీడారు. త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ టికెట్ నిరాకరించిన మరుసటి రోజే మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వామ్మో.. దేశంలో 40 వేలు దాటిన యాక్టివ్ కరోనా కేసులు.. కొత్తగా 7,830 కోవిడ్ కేసులు నమోదు..

మొదటి విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. ఇందులో బెళగావి జిల్లాలోని అథానిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ కుమతల్లికి టికెట్ కేటాయించింది. అయితే అథాని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సవది 2018 ఎన్నికల్లో కుమత్తల్లి (అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు) చేతిలో ఓడిపోయారు. తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. 

బీహార్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదు..

ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘నేను నా నిర్ణయం తీసుకున్నాను. నేనేమి గిన్నె పట్టుకొని భిక్షాటన చేస్తూ తిరిగే వ్యక్తిని కాదు. నేను ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నాయకుడిని. నేను ఎవరి ప్రభావంతో నటించడం లేదు.’’ అని అన్నారు. 

గురువారం సాయంత్రం వరకు తాను ఓ గట్టి నిర్ణయం తీసుకుంటానని, శుక్రవారం నుంచి పని ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. కాగా.. లక్ష్మణ్ సవది తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019లో యడ్యూరప్ప నాయకత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి సహకరించిన ఫిరాయింపుదారుల బృందంలో కుమటల్లి ఒకరు.

40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జననం.. ప్రపంచంలో అత్యంత సారవంతమైన మహిళగా గుర్తింపు పొందిన నబతాంజీ

బీజేపీ 89 మంది అభ్యర్ధులతో విడుదల చేసిన తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. అంతే కాకుండా 32 మంది ఓబీసీ, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్ధులకు స్థానం కల్పించింది. అలాగే లిస్ట్‌లో 9 మంది డాక్టర్లకు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఛాన్స్ ఇచ్చింది. ఈ జాబితాలో 8 మంది మహిళలకు కూడా చోటు దక్కింది.

టీఎస్ పీఎస్సీ లీక్ కేసు.. పరీక్ష రాసి, టెన్షన్ తో నిద్రలేని రాత్రులు.. దొరక్కూడదని దేవస్థానాలన్నీ తిరిగిన జంట

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని  బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు. మే 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం