బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అయినా 15కి.మీ.లు నడిపి... ప్రయాణికులను గమ్యానికి చేర్చి.. ఆ తరువాత..

Published : Apr 12, 2023, 12:25 PM IST
బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అయినా 15కి.మీ.లు నడిపి... ప్రయాణికులను గమ్యానికి చేర్చి.. ఆ తరువాత..

సారాంశం

బస్సు హైవే మీద ఉండగా ఓ ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఏం చేయాలో తోచలేదు. ప్రయాణికులను అలా వదిలేయలేక.. 15.కి.మీ. లు నడికి గమ్యానికి చేర్చి ప్రాణాలు కోల్పోయాడు.   

గుజరాత్ : గుజరాత్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.  అయితే ఆ డ్రైవర్ నిబద్దతకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. గుండెను నొప్పి మెలిపెడుతున్నా ప్రయాణికుల ప్రాణాలు కళ్ళ ముందు కనిపించాయి. ఆ నొప్పిని లెక్కచేయకుండా ప్రయాణికులు అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి.. ఆ తర్వాత కన్నుమూశాడు ఓ  బస్సు డ్రైవర్. ఈ హృదయ విదారకమైన ఘటన సోమవారం గుజరాత్ లోని రాధన్ పూర్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి ఆ బస్సులో ఉన్న కండక్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న భర్మల్ అహీర్ (40) గుజరాత్ లోని రాధన్ పూర్ లో డ్యూటీ చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా బస్సు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. బస్సు మార్గమధ్యంలో ఉండగా చాతిలో నొప్పి రావడం మొదలయ్యింది. అయితే, బస్సును ఎక్కడ ఆపడానికి వీలు లేకపోవడంతో చాతి నొప్పిని భరిస్తూనే 15 కిలోమీటర్ల వరకు బస్సును నడిపాడు.  బస్సును డిపోకు చేర్చిన తర్వాత గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మహిళతో అసభ్యప్రవర్తన.. అడిగినందుకు భర్త హత్య...మైనర్ బాలుడు అరెస్ట్..

అది గమనించిన సిబ్బంది వెంటనే అహిర్ ను రాధన్ పూర్  సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు  అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.  ఆదివారం రాత్రి 8:30 గంటలకు అహిర్ బస్సు డ్రైవింగ్ చేస్తూ సోమనాథ్ బయలుదేరాడు. సోమవారం ఉదయం 7.05గంటలకు రాధన్ చేరుకోవాల్సి ఉంది. ఉదయం టీ బ్రేక్ కోసం వారాహి వద్దా కొద్దిసేపు బస్సును ఆపారు.

అదే సమయంలో బస్సులోని కండక్టర్ తో ఆహీర్  తనకు ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు తెలిపాడు. బస్సులోని ప్రయాణికులను హైవే మీద ఒంటరిగా వదిలేయడానికి అతడికి మనసుపలేదు. దీంతో చాతినొప్పితోనే బస్సును అలాగే  20 నిమిషాల పాటు నడిపి  డిపోకు చేర్చాడు.  ఆ తర్వాత అతడు మృతి చెందాడని..  బస్సులోని కండక్టర్ చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం