ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం యత్నం: తల్లీబిడ్డ మృతి, భర్త అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 22, 2024, 6:38 AM IST

ఆక్యుపంక్చర్ వైద్యం కారణంగా  మహిళతో పాటు పురిట్లోనే చిన్నారి మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.


తిరువనంతపురం: ఆసుపత్రిలో కాకుండా ఇంట్లోనే  భార్య డెలివరీ కోసం  ఓ వ్యక్తి  ప్రయత్నించాడు. అయితే డెలివరీ సమయంలో  సరైన వైద్య సహాయం లేని కారణంగా  మహిళ, చిన్నారి మృతి చెందారు.ఈ ఘటన వెలుగు చూడడంతో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్యుపంక్చర్ తో ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ ఘటన  చోటు చేసుకుంది. 

ఐపీసీ  సెక్షన్ 304 కింద ఇందుకు భాద్యుడిగా భావిస్తూ  భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. 

Latest Videos

తిరువనంతపురంలోని  36 ఏళ్ల గర్భిణి షెమీరా  బీవీ ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. అయితే  ఈ సమయంలో  ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.  తీవ్రంగా రక్తస్రావమైంది.  చివరకు ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది.  ఆసుపత్రిలో  చేర్పించిన కొద్ది సేపట్లోనే గర్భిణీ, చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

ఇంట్లోనే  డెలీవరీ అయ్యేందుకు గాను  యూట్యూబ్ లో  విడీయోలు చూశాడు. వైద్య సహాయం తీసుకోలేదు.  ప్రసవ సమయంలో  బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో  ఆమెకు సరైన చికిత్స అందకపోవడంతో ఆమె మృతి చెందింది.

బాధితురాలి ఇంటికి ఆశా వర్కర్లు వెళ్లినా కూడ  భర్త అనుమతించేది కాదని స్థానికులు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఘటన తీవ్రమైన నేరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.  మృతురాలికి ఇంటికి గతంలో  జిల్లా మెడికల్ అధికారి  బృందం  వెళ్లి  వైద్య సహాయం తీసుకోవాలని సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.   అయితే  ఆక్యుపంక్చర్ వైద్యం తీసుకుంటున్నట్టుగా దంపతులు చెప్పారన్నారు.  అయితే  సరైన వైద్య సహాయం లేని కారణంగా  తల్లీబిడ్డా మరణానికి కారణమైందని  మంత్రి చెప్పారు.  ఈ ఘటన దిగ్బ్రాంతి కలిగించిందన్నారు.  ఆరోగ్య సంరక్షణలో ముందుండే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని మంత్రి చెప్పారు. 

 

click me!