
రెహమాన్ గుర్తున్నాడా? ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెహమాన్ ఇప్పుడు ఆమెను చట్టపబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్ మారా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది.
పాలక్కాడ్ జిల్లా అయిలూర్ కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచి పెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చట్ట విరుద్ధంగా యువతిని నిర్భంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడి మీద కేసు పెట్టింది.
2010 ఫిబ్రవరి 2 న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18యేళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వైరీ చేశారు. కానీ ఏమీ క్లూ దొరకలేదు. మరోవైపు సజిత తల్లిదండ్రులు అలుపెరగకుండా సజితను వెతికారు. కానీ ఆమె కనిపించలేదు. ఏళ్లు గడిచే కొద్ది ఆమె మీద ఆశలు వదులుకున్నారు. చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్ కార్డులో ఆమె పేరు కూడా తీసేశారు. కానీ ఆమె బతికే ఉంది. అదీ వాళ్లింటికి పదిళ్ల అవతలే.
కేరళలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తన టీనేజ్ వయసులో ఉన్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇంట్లో చెప్పకుండా ఆ అబ్బాయితో లేచిపోయింది. ఆమె కోసం ఎక్కడెక్కడో గాలించినా ఆచూకీ లభించలేదు.
ఈ క్రమంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అమ్మాయి దొరికింది’ అని చెప్పారు. తీరా వెళ్లే సరికి ఆ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. అతడ్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అతడు తమ పక్కింటి కుర్రాడే. ఆ అమ్మాయి మరెక్కడికో లేచిపోలేదు! పక్కింటికే వెళ్లింది. ఇన్ని సంవత్సరాలు అక్కడే గడిపింది.
ప్రియుడితో యువతి పరార్.. పక్కింట్లోనే కాపురం పెట్టినా..!
అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. ఆ అబ్బాయి.. తన పక్కింటి ప్రియురాలిని.. ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో.. తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే.. లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు.
ఆ గదికి అటాచ్డ్ బాత్‌రూమ్ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట! మూడు నెలల క్రితం ఆ అబ్బాయి.. గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేసేవాళ్లు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు.