ఢిల్లీలో ఆరుగురు తీవ్రవాదులు అరెస్ట్.. తమిళనాడులో హై అలర్ట్...

Published : Sep 16, 2021, 09:21 AM IST
ఢిల్లీలో ఆరుగురు తీవ్రవాదులు అరెస్ట్.. తమిళనాడులో హై అలర్ట్...

సారాంశం

అక్టోబర్ 14న దసరా, నవంబర్ 4న దీపావళి పండుగల సందర్భంగా  అన్ని జిల్లాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.  జనాలు అధికంగా గుమిగూడే మార్కెట్ల వద్ద పోలీసులు నిఘాను పెంచనున్నారు. 

చెన్నై : ఢిల్లీలో ఆరుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా తీవ్రవాదులు హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ కేంద్ర ఇంటిలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడు రాష్ట్రమంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు  పోలీసు ఉన్నతాధికారులు  ప్రకటించారు.

అక్టోబర్ 14న దసరా, నవంబర్ 4న దీపావళి పండుగల సందర్భంగా  అన్ని జిల్లాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.  జనాలు అధికంగా గుమిగూడే మార్కెట్ల వద్ద పోలీసులు నిఘాను పెంచనున్నారు. 

తల్లిని చంపిన కొడుకు.. శవాన్ని రెండు సంవత్సరాలు బెడ్రూమ్ లో..!

ప్రముఖ జౌళి,  నగల దుకాణాలు,  వాణిజ్య సంస్థలు,  షాపింగ్ మాల్స్  తదితర ప్రాంతాల్లో సాయుధ దళాలతో కాపలా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్ స్టేషన్లు, ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో తీవ్రవాదులు చొరబడకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలీసుల నిఘా కూడా పెంచుతున్నామని ఆయన వివరించారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu