తల్లిని చంపిన కొడుకు.. శవాన్ని రెండు సంవత్సరాలు బెడ్రూమ్ లో..!

Published : Sep 16, 2021, 08:58 AM IST
తల్లిని చంపిన కొడుకు.. శవాన్ని రెండు సంవత్సరాలు బెడ్రూమ్ లో..!

సారాంశం

. వెంటనే బెడ్రూమ్ లోనే ఆమె శవాన్ని పాతిపెట్టేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. 

ఓ వ్యక్తి కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య  చేశాడు. అనంతరం శవాన్ని తన ఇంట్లోని బెడ్రూమ్ లోనే పాతి పెట్టడం గమనార్హం. కాగా.. ఈ సంఘటన రెండు సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో  చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బురుద్వాన్ జిల్లాకు చెందిన సుక్రన్ బీబీ(58) అనే మహిళ తన చిన్న కుమారుడు సాహిదుల్ షేక్ అలియాస్ నయన్(38) దగ్గర ఉండేది.  అయితే.. కొడుకు తల్లి అనుమతితో.. ఓ చిన్నపాటి ట్రిప్ కి వెళ్లాలి అనుకున్నాడు. అదే విషయాన్ని తల్లితో చెప్పాడు. అందుకు తల్లి అంగీకరించలేదు.

దీంతో.. తీవ్ర కోపోనికి గురైన సాహిదుల్ షేక్.. ఆవేశంలో తల్లిని  చంపేశాడు. ఓ వస్తువు తీసుకొని తల్లి తలపై బలంగా కొట్టాడు.  దీంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే బెడ్రూమ్ లోనే ఆమె శవాన్ని పాతిపెట్టేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రతిరోజూ తల్లి శవాన్ని పాతిపెట్టిన దగ్గర వాసన రాకుండా ఉండేందుకు.. సువాన వచ్చే స్టిక్స్ వెలిగించేవాడు.

అతను తల్లిని హత్య చేసే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె హత్య విషయం బయటకు రాలేదు. ఆమె కనిపించకుండా పోవడంతో.. పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. అప్పటి నుంచి ఆమె కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.

దీంతో.. ఆమె గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. సాహిదుల్ షేక్ కి.. అతని భార్య కు మధ్య గొడవ జరగడంతో.. భర్త మీద కోపంతో.. అతని భార్య స్వయంగా పోలీసులకు వివరించింది. దీంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.   పోలీసులు రంగ ప్రవేశం చేసి.. అతని భార్య చెప్పిన ప్రదేశంలో తవ్వి చూశారు. దీంతో.. ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటనతో కుటుంభస్యులంతా షాకయ్యారు.  నిందితుడిని అదుపులోకి తీసుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu