ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం లేదు.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం - కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

Published : Nov 18, 2022, 04:10 PM ISTUpdated : Nov 18, 2022, 04:12 PM IST
ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం లేదు.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం - కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

సారాంశం

తాను ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం లేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. తాను రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి ప్రభుత్వ పనులు జరగడం చూడటమే తన పని తెలిపారు. 

తన రాజ్యాంగ పదవిని రాజకీయం చేశారన్న ఆరోపణలను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గట్టిగా తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం "రాజకీయ సమస్యాత్మకంగా" భావించే సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తిని నియమించినట్లు ఆధారాలు లభిస్తే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ వ్యవహారాలు చట్టానికి లోబడి జరిగేలా చూడటమే తన పని అని ఖాన్ నొక్కి చెప్పారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకంపై కేరళ వామపక్ష ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య కొంత కాలంగా సాగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా వైదొలిగిన ఫరూఖ్ అబ్దుల్లా.. వచ్చే నెల 5లోపు కొత్త సారథి కోసం ఎన్నిక

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడు సంవత్సరాలుగా గవర్నర్ పదవిని రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ‘‘రాజకీయం ఎక్కడుంది? గత మూడేళ్లుగా నేను ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నానని మీరు (కేరళ వామపక్ష ప్రభుత్వం) చెబుతున్నారు. నాకు ఒక్క పేరు చెప్పండి. రాజకీయంగా ఆరెస్సెస్, బీజేపీ వంటి సంస్థలకు చెందిన ఎవరినైనా నేను నా అధికారాన్ని నియమించానా ? దీనిని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను ’’ అని ఆయన అన్నారు. ఇలాంటి చేస్తే అది రాజకీయం అవుతుందని, కానీ తాను అలా చేయలేదని అన్నారు. ఇలా చేయాలని తనపై ఒత్తిడి కూడా లేదని గవర్నర్ చెప్పారు. 

తనకు వ్యతిరేకంగా ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన తాను ఆనందాన్ని ఉపసంహరించుకోలేదని మంత్రి బాలగోపాల్ ను ఉద్దేశించి గవర్నర్ అన్నారు. ‘‘యూపీలో పుట్టిన వ్యక్తికి కేరళ విద్యా వ్యవస్థపై అవగాహన ఎలా ఉంటుందో ఆయన (ఆర్థిక మంత్రి) చెప్పారు. ఆయన ప్రాంతీయవాదం అగ్నిని రగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. భారతదేశ ఐక్యతను సవాలు చేస్తున్నారు. ’’ అని తెలిపారు.

వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. అలా చేస్తేనే పని భారం తగ్గుతుంది: సీజేఐ

కేరళకు చెందిన వ్యక్తి ప్రాంతీయ వాదపు మంటలను రగిలించడానికి ప్రయత్నిస్తే, రాష్ట్రం వెలుపల పనిచేసే కేరళీయులను అది ఎలా ప్రభావితం చేస్తుందని ఆయన అననారు. బాలగోపాల్ మంత్రి పదవిలో కొనసాగడాన్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అది ముఖ్యమంత్రి ఎంపిక కాబట్టి ఆయనను తొలగించే అధికారం తనకు లేదని అన్నారు. అయితే ఈ విషయాన్ని తాను కేరళ ప్రజలకు తెలియజేస్తానని చెప్పారు. 

భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి బెదిరింపులు.. ‘మధ్యప్రదేశ్‌లోకి వచ్చాక బాంబ్ వేసి చంపేస్తాం’

కాగా.. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో వామపక్ష పార్టీలు మంగళవారం రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని రాజ్ భవన్ వరకు నిరసన ర్యాలీని చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్ పదవి పోటీ పడే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ‘‘ ఈ లౌకిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని తమకు నచ్చిన ఫాసిస్ట్ హిందుత్వ రాష్ట్రంగా మార్చడానికి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ రూపకల్పనలో విద్యను నియంత్రించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. దాని కోసం వారు విద్య, మన యువత చైతన్యాన్ని నియంత్రిస్తారు ’’ అని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?