వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి: కేరళ సీఎం విజయన్‌కు కరోనా

By Siva KodatiFirst Published Apr 8, 2021, 6:44 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పలువురు కోవిడ్ బారినపడుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్రముఖులు సైతం వున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ‌పాజిటివ్‌గా తేలింది

దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పలువురు కోవిడ్ బారినపడుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్రముఖులు సైతం వున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ‌పాజిటివ్‌గా తేలింది.

మార్చి 3న ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోం ఐసోలేషన్‌లో వున్నారు. కాగా, నిన్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు కరోనా సోకింది.

తాజాగా ఆయనకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు విప్లవ్ కుమార్ వెల్లడించారు.

Also Read:హడలెత్తిస్తున్న కోవిడ్.. 24 గంటల్లో లక్షాముప్పై కేసులు..

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. 

మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో లక్షా 26వేల 789 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. వరసగా రెండో రోజు కరోనాతో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న 685 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 1,66,862 మంది వైరస్ కారణంగా బలయ్యారు.

click me!